షూటింగ్ లో గాయపడ్డ స్టార్ హీరో సిద్దార్థ్ మల్హోత్రా.. గాయాలను లెక్కచేయకుండా సీన్ కంప్లీట్.. వీడియో వైరల్..

Published : May 17, 2022, 05:52 PM IST
షూటింగ్ లో గాయపడ్డ స్టార్ హీరో సిద్దార్థ్ మల్హోత్రా.. గాయాలను లెక్కచేయకుండా సీన్ కంప్లీట్.. వీడియో వైరల్..

సారాంశం

బాలీవుడ్ స్టార్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా (Sidharth Malhotra) విభిన్న పాత్రల్లో నటిస్తూ తన అభిమానులను, నార్త్ ఆడియెన్స్ అలరిస్తున్నారు. అయితే ఓ వెబ్ సిరీస్ లో నటిస్తున్న సిద్ధార్థ్.. షూటింగ్ చేస్తున్న క్రమంలో గాయపడ్డాడు.   

వరుస చిత్రాల్లో నటిస్తూ నార్త్  ఆడియెన్స్ ను అలరిస్తున్నారు టాలెంటెడ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా. ఈ ఏడాది ఏకకాలంలో మూడు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు. అలాగే ‘ఇండియన్ పోలీస్ ఫోర్స్’ అనే ఓ వెబ్ సిరీస్ లోనూ తొలిసారిగా నటిస్తున్నాడు సిద్ధార్థ్. ఈ వెబ్ సిరీస్ కు రోహిత్ శెట్టి దర్శకత్వం వహించారు. ప్రస్తుతం సిరీస్ కు సంబంధించిన షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది.

తాజా షెడ్యూల్ ను మేకర్స్ గోవాలో చిత్రీకరిస్తున్నారు.  అయితే, ఆదివారం నాటి షూటింగ్‌లో సిద్ధార్థ్ మల్హోత్రా గాయపడ్డాడు. ఓ యాక్షన్ సీన్‌ షూటింగ్‌లో ఉన్నప్పుడు సిద్ధార్థ్‌ కుడి చేతికి గాయమైంది. యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేస్తున్న క్రమంలో దెబ్బతగిలినా సీన్ ను పూర్తి చేశాడు సిద్ధార్థ్ దీంతో నటనపై ఆయనకున్న ఫోకస్ ను నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. తనకు తగిలిన గాయాలను చూపిస్తూ రోహిత్ శెట్టితో కలిసి ఉన్న ఫొటోలను సిద్ధార్థ్ మల్హోత్రా తాజాగా తన అభిమానులతో పంచుకున్నాడు. అలాగే యాక్షన్ సీక్వెన్స్ కు సంబంధించిన వీడియోనూ షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో, ఫొటో నెట్టింట వైరల్ అవుతున్నాయి.  
 
స్టార్ హీరోలతో హిట్ చిత్రాలను తెరకెక్కించిన ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు రోహిత్ శెట్టి (Rohit Shetty) డైరెక్షన్ లో సిద్ధార్థ్ మల్హోత్రా మొదటిసారిగా నటిస్తున్నారు. ఆయన డైరెక్షన్ అంటే ఈమాత్రం నిజమైన స్వెట్, నిజమైన రక్తం సమనంగా ఉంటాయని సిద్ధార్థ్ ఫన్నీగా క్యాప్షన్ ఇచ్చారు. రోహిత్ శెట్టి చివరిగా గతేడాది రిలీజ్ అయిన ‘సూర్యవంశీ’ చిత్రానికి దర్శకత్వం వహించారు. ప్రస్తుతం ‘సర్కస్, సింగం 3, ఇండియన్ పోలీస్ ఫోర్స్’ చిత్రాలను తెరకెక్కిస్తున్నారు. ఇక సిద్ధార్థ్ చివరిగా ‘షేర్ షా’ చిత్రంతో అలరించాడు. ప్రస్తుతం ‘మిషన్ మంజు, థ్యాంక్ గాడ్, యోదా’ సినిమాల్లో నటిస్తున్నాడు. ‘మిషన్ మంజు’లో సిద్దార్థ్ సరసన టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మండన్న నటిస్తోంది.

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Emmanuel lover ఎవరో తెలుసా? డాక్టర్ ను పెళ్లాడబోతున్న బిగ్ బాస్ 9 టాప్ కంటెస్టెంట్
Bigg Boss telugu 9 బోరుమని ఏడ్చిన రీతూ, బయటకు వెళ్తూ బాంబ్ పేల్చిన కంటెస్టెంట్