బిగ్ బాస్3 లో స్టార్ డైరెక్టర్

By Prashanth MFirst Published Jun 24, 2019, 6:32 PM IST
Highlights

తమిళ్ బిగ్ బాస్ సీజన్ 3 గ్రాండ్ గా ప్రారంభమైంది. నిర్వాహకులు మరోసారి కమల్ హాసన్ తో షోను నడిపించేందుకు అంతా సిద్ధం చేశారు. అయితే గత రెండు సీజన్స్ లలో పాల్గొన్న కంటెస్టెంట్స్ వివాదాలతో రచ్చ బాగానే చేశారు. 

తమిళ్ బిగ్ బాస్ సీజన్ 3 గ్రాండ్ గా ప్రారంభమైంది. నిర్వాహకులు మరోసారి కమల్ హాసన్ తో షోను నడిపించేందుకు అంతా సిద్ధం చేశారు. అయితే గత రెండు సీజన్స్ లలో పాల్గొన్న కంటెస్టెంట్స్ వివాదాలతో రచ్చ బాగానే చేశారు. అయితే ఈ సారి కొంచెం కొత్తగా ఉండాలని సెన్సిటివ్ సెలబ్రెటీలను హౌజ్ లోకి రప్పిస్తున్నారు. 

సీనియర్ దర్శకుడు చేరన్ కూడా ఈ షోలో కంటెస్టెంట్ గా అడుగుపెట్టాడు. నా ఆటోగ్రాఫ్ (తమిళ్) సినిమాకు దర్శకత్వం వహించి హీరోగా చేసిన చేరన్ మల్టీటాలెంటెడ్ గా గుర్తింపు దక్కించుకున్నాడు. నాలుగు నేషనల్ అవార్డ్స్ కూడా గెలుచుకున్నాడు. నిర్మాతగా నటుడిగా - దర్శకుడిగా పాపులర్ అయిన ఈ సెన్సిటివ్ సెలబ్రెటీని బిగ్ బాస్ హౌస్ కి పంపారు.  

ఈ సారి హౌస్ లో వివాదాల డోస్ మరింత పెరిగేలా టాస్క్ లు ఉంటాయని సమాచారం. గత సీజన్ లో బుల్లితెరపై లిప్ లాక్ కూడా చూపించిన తమిళ్ కంటెస్టెంట్ లు బాగానే పాపులర్ అయ్యారు. మరి ఇప్పుడు  కొత్త కంటెస్టెంట్స్ ఏ విధంగా ఆకట్టుకుంటారో చూడాలి.    

click me!
Last Updated Jun 24, 2019, 6:32 PM IST
click me!