మహేష్‌తో సినిమాపై మణిరత్నం ఆసక్తికర వ్యాఖ్యలు..

Published : Jul 10, 2021, 09:03 AM IST
మహేష్‌తో సినిమాపై మణిరత్నం ఆసక్తికర వ్యాఖ్యలు..

సారాంశం

స్టార్‌ డైరెక్టర్‌ మణిరత్నం మహేష్‌బాబుతో సినిమాకి సంబంధించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. గతంలో తాను ఓ సినిమా చేయాలనుకున్నట్టు తెలిపారు. అంతేకాదు త్వరలో..

స్టార్‌ డైరెక్టర్‌ మణిరత్నం కన్ను ఇప్పుడు టాలీవుడ్‌పై పడింది. ఇంకా చెప్పాలంటే మహేష్‌పై పడింది. ఆయన మహేష్‌బాబుతో సినిమా చేయాలని భావిస్తున్నారట. తాజాగా ఈ విషయాన్ని మీడియా వేదికగా వెల్లడించారు. ఇటీవల మణిరత్నం సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడటం లేదు. ఈ నేపథ్యంలో తన సినిమాల పవర్‌ఏంటో చూపించేందుకు `పొన్నియిన్‌ సెల్వన్‌` అనే పాన్‌ ఇండియా చిత్రంతో రాబోతున్నారు. పీరియాడికల్‌ నేపథ్యంలో రూపొందుతున్న చిత్రమిది. విక్రమ్‌, కార్తి వంటి బిగ్‌స్టార్స్ నటిస్తున్నారు. ప్రస్తుతం ఇది చిత్రీకరణ దశలో ఉంది. 

ఇదిలా ఉంటే కరోనా సమయంలో ఓ వెబ్‌ సిరీస్‌ని రూపొందించారు మణిరత్నం. `నవరస` పేరుతో నెట్‌ఫ్లిక్స్ కోసం ఓ సిరీస్‌ని నిర్మించారు. తొమ్మిది కథలు, తొమ్మిది ఎమోషన్స్ ప్రధానంగా, తొమ్మిది మంది దర్శకులు, తొమ్మిది మంది సినిమాటోగ్రాఫర్లు ఇలా తొమ్మిది మందితో రూపొందించిన ఈ `నవరస` టీజర్‌ విడుదలైంది. ప్రధానంగా తారాగణమైన సూర్య, విజయ్‌ సేతుపతి, ప్రకాష్‌ రాజ్‌, అరవింద స్వామి, సిద్ధార్థ్‌, రేవతి ఇలా ప్రతి ఒక్కరిలోని నవరసాలకు పలికించేలా టీజర్‌ సాగింది. బీజీఎం అదరగొట్టింది. 

ఈ సందర్భంగా మణిరత్నం మాట్లాడుతూ, మహేష్ బాబుతో సినిమా చేస్తానని తెలిపారు. గతంలో ఓ సారి మహేష్‌తో సినిమా కోసం చర్చలు జరిపానని, స్టొరీ సరిగ్గా కుదరకపోవడంతో ఈ ప్రాజెక్ట్ సెట్‌ కాలేదని,   సరైన కథ దొరికినప్పుడు తప్పక మహేష్ బాబుతో సినిమా చేస్తానని వెల్లడించారు. దీంతో ఈ కాంబినేషన్‌పై సరికొత్త చర్చ మొదలైంది. ప్రస్తుతం మహేష్‌ `సర్కారు వారి పాట` చిత్రంలో నటిస్తున్నారు. పరశురామ్‌ దర్శకుడు. కీర్తిసురేష్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

500 కోట్ల ధురంధర్, స్టార్ హీరోలను కూడా భయపెడుతున్న రణ్ వీర్ సింగ్ సినిమా
రవితేజ సంచలన నిర్ణయం, మాస్ మహారాజా ట్యాగ్ ను దూరం పెట్టిన స్టార్ హీరో?