జెన్నిఫర్ లోపేజ్ బెడ్ పై పడుకున్నా: శ్రీనువైట్ల!

Published : Nov 09, 2018, 04:00 PM IST
జెన్నిఫర్ లోపేజ్ బెడ్ పై పడుకున్నా: శ్రీనువైట్ల!

సారాంశం

ప్రముఖ పాప్ సింగర్ జెన్నిఫర్ లోపేజ్ పడుకున్న బెడ్ పై ఆమె తరువాత నేనే పడుకున్నా అంటున్నాడు దర్శకుడు శ్రీనువైట్ల. అసలు విషయంలోకి వస్తే ప్రస్తుతం ఆయన 'అమర్ అక్బర్ ఆంటోనీ' సినిమాను తెరకెక్కిస్తోన్నసంగతి తెలిసిందే. 

ప్రముఖ పాప్ సింగర్ జెన్నిఫర్ లోపేజ్ పడుకున్న బెడ్ పై ఆమె తరువాత నేనే పడుకున్నా అంటున్నాడు దర్శకుడు శ్రీనువైట్ల. అసలు విషయంలోకి వస్తే ప్రస్తుతం ఆయన 'అమర్ అక్బర్ ఆంటోనీ' సినిమాను తెరకెక్కిస్తోన్నసంగతి తెలిసిందే. ఈ సినిమాలో కొంత భాగాన్ని అమెరికాలో చిత్రీకరించారు. 

ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే.. సినిమా షూటింగ్ జెన్నిఫర్ లోపేజ్ భవంతిలో జరిగిందట. అక్కడ సినిమా షూట్ చేయడం, ఆ భవనం విశేషాలను చెప్పుకొచ్చాడు శ్రీనువైట్ల. ''జెన్నిఫర్ లోపేజ్ తన భవంతిని అమ్మేసింది. దాన్ని ఓ తెలుగు వ్యక్తి తీసుకున్నాడు. అదే సమయంలో మా సినిమాలో ఓ ఎపిసోడ్ కోసం నేను ఓ పాత భవంతిని వెతుకుతున్నాను.

యూరోప్ లో తీయాలని అనుకున్నాను. అదే టైమ్ లో జెన్నీఫర్ భవనం కనిపించింది. వెంటనే ఓకే చేశాను'' అంటూ వెల్లడించగా.. హీరో రవితేజ మాత్రం ఆ ఎపిసోడ్ లో లేనని అంటున్నాడు. ఆ కారణంగానే తనకు ఆ భవనంతో సంబంధం లేదని.. శ్రీనువైట్ల మాత్రం జెన్నిఫర్ లోపేజ్ పడుకున్న బెడ్ పైనే హాయిగా పడుకున్నాడని అన్నారు. 

జెన్నిఫర్ తన భవంతిని ఖాళీ చేసిన తరువాత అందులోకి ఎవరూ  షిఫ్ట్ కాలేదు. దీంతో జెన్నిఫర్ తరువాత ఆమె బెడ్ రూమ్ లో పడుకున్న వ్యక్తి శ్రీను వైట్లనే.. ఇక 'అమర్ అక్బర్ ఆంటోనీ' సినిమా విషయానికొస్తే.. నవంబర్ 16న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.  
 

PREV
click me!

Recommended Stories

నయనతార 120 కోట్ల ఇల్లు, కళ్లు చెదిరే ఇంటీరియర్, మైమరచిపోయో గార్డెన్ చూశారా?
Balakrishna: సంక్రాంతి బరిలో `సమరసింహారెడ్డి`తో పోటీపడి చావు దెబ్బ తిన్న కృష్ణ, రాజశేఖర్‌.. బాలయ్యతో గేమ్‌ ఈజీ కాదు