కమిడియన్ శ్రీనివాస రెడ్డి ఫస్ట్ డైరక్షన్ చిత్రం ట్రైలర్

Published : Nov 21, 2019, 07:20 AM IST
కమిడియన్ శ్రీనివాస రెడ్డి ఫస్ట్ డైరక్షన్ చిత్రం ట్రైలర్

సారాంశం

కామెడీ ప్రధానంగా రూపొందుతున్న ‘‘భాగ్యనగర వీధుల్లో గమ్మత్తు’’ ట్రైలర్ ఇంట్రస్టింగ్ గా ఉంది. సత్య, షకలక శంకర్ కీలక పాత్రల్లో నటించగా, వెన్నెల కిశోర్, చిత్రం శ్రీను, రఘబాబు, సత్యం రాజేష్, సుమన్ శెట్టి ఇతర పాత్రల్లో కనిపించనున్నారు.

 

క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, కమిడియన్ గా, హీరోగా ప్రేక్షకుల్ని అలరిస్తున్న శ్రీనివాసరెడ్డి దర్శకుడిగా మరో అవతారం ఎత్తి మెప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన నిర్మాతగా, దర్శకుడిగా మారి చేస్తున్న చిత్రం ‘‘భాగ్యనగర వీధుల్లో గమ్మత్తు’’.. (మంచి రసగుల్లా లాంటి సినిమా). ఆకృతి - ఆశృతి సమర్పణలో.. ఏ ఫ్లైయింగ్ కలర్స్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రొడక్షన్ బ్యానర్‌పై.. శ్రీనివాస రెడ్డి ప్రధాన పాత్రలో నటిస్తూ, నిర్మించిన ‘భాగ్యనగర వీధుల్లో గమ్మత్తు’ థియేట్రికల్ ట్రైలర్ మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ రిలీజ్ చేశారు.

కామెడీ ప్రధానంగా రూపొందుతున్న ఈ సినిమా ట్రైలర్ ఇంట్రస్టింగ్ గా ఉంది. సత్య, షకలక శంకర్ కీలక పాత్రల్లో నటించగా, వెన్నెల కిశోర్, చిత్రం శ్రీను, రఘబాబు, సత్యం రాజేష్, సుమన్ శెట్టి ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క జరుగుతోంది..ప్రముఖ నిర్మాత దిల్‌రాజు ఈ చిత్రాన్ని విడుద‌ల చేయబోతున్నారు. ‘జ‌య‌మ్ము నిశ్చయ‌మ్మురా’ ర‌చ‌యిత ప‌రం సూర్యాన్షు ఈ సినిమాకు క‌థ‌, మాట‌లు, స్క్రీన్‌ప్లేను అందించారు.

డిసెంబర్ 6న ‘‘భాగ్యనగర వీధుల్లో గమ్మత్తు’’ రిలీజ్ కానుంది. సినిమాటోగ్రఫీ : భరణి కె ధరన్, ఎడిటింగ్ : ఆవుల వెంకటేష్, మ్యూజిక్ : సాకేత్ కోమండూరి, ఆర్ట్ : రఘు కులకర్ణి, లైన్ ప్రొడ్యూసర్ : చిత్రం శ్రీను, నిర్మాత, దర్శకత్వం : వై.శ్రీనివాస రెడ్డి.

 

PREV
click me!

Recommended Stories

Jr NTR: చిరంజీవి తర్వాత ఎన్టీఆర్ ని టార్గెట్ చేశారా ?..సంచలన నిర్ణయం, తారక్ పేరుతో ఎవరైనా అలా చేస్తే చుక్కలే
Illu Illalu Pillalu Today Episode Dec 9: అమూల్యతో పెళ్లికి విశ్వక్ కన్నింగ్ ప్లాన్, వల్లిని నిలదీసిన రామరాజు