ఆమెని సెట్స్ లో వేధించిన యష్ ? పవన్ కళ్యాణ్ సహా సౌత్ స్టార్లపై ఇలా.. ఇచ్చి పడేసిన కేజీఎఫ్ హీరోయిన్

By Asianet NewsFirst Published Mar 17, 2023, 1:47 PM IST
Highlights

కేజిఎఫ్ రెండు భాగాలలో యంగ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించింది. దీనితో ఆమెకి పాన్ ఇండియా గుర్తింపు లభించింది.కేజిఎఫ్ సక్సెస్ ని క్యాష్ చేసుకోవడంలో శ్రీనిధి ఫెయిల్ అవుతోంది.

కేజిఎఫ్ రెండు భాగాలలో యంగ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించింది. దీనితో ఆమెకి పాన్ ఇండియా గుర్తింపు లభించింది. కెజిఎఫ్ లో శ్రీనిధి శెట్టి అందాలు అంతగా ఆరబోయలేదు. హోమ్లీగానే కనిపించింది. కొన్ని సన్నివేశాల్లో మాత్రమే మోడరన్ డ్రెస్సుల్లో మెరిసింది. 

హీరో యష్, శ్రీనిధి మధ్య కెమిస్ట్రీకి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. హావభావాలు పలికించడంలో, ఎమోషనల్ గా నటించడంలో శ్రీనిధి మంచి మార్కులు కొట్టేసింది. అయితే కెజిఎఫ్ సక్సెస్ ని క్యాష్ చేసుకోవడంలో శ్రీనిధి ఫెయిల్ అవుతోంది. కెజిఎఫ్ తర్వాత ఆమె కోబ్రా చిత్రంలో మాత్రమే నటించింది. 

ఇదిలా ఉండగా తాజాగా శ్రీనిధి మరోసారి వార్తల్లో నిలిచింది. ఫేక్ ప్రచారాలు చేసే వారికి సోషల్ మీడియా ఈ రోజులల్లో బాగా ఉపయోగపడుతోంది. తాను క్రిటిక్ ని అని, సెన్సార్ బోర్డు సభ్యుడిని అని చెప్పుకుని ఉమైర్ సంధు అనే వ్యక్తి సోషల్ మీడియాలో హడావిడి చేయడం చూస్తూనే ఉన్నాం. సినిమాలకు సంబంధించి ఎవరూ ఊహించని కామెంట్స్ చేస్తూ అటెన్షన్ పొందుతుంటాడు. 

 

As per Actress , I felt very uncomfortable working with . Will never work with him again. He is very Toxic, Tharki & Harassed Kind of Person. pic.twitter.com/0T6rZDA87p

— Umair Sandhu (@UmairSandu)

స్టార్స్ వ్యక్తిగత జీవితాల గురించి కూడా ఫేక్ న్యూస్ క్రియేట్ చేస్తూ సోషల్ మీడియాలో చిన్నపాటి అలజడి సృష్టిస్తుంటాడు. ఇటీవల ఈ తంతు మరీ ఎక్కువ అయింది. పవన్ కళ్యాణ్, దలపతి విజయ్, యష్, సల్మాన్ ఖాన్ ఇలా బడా స్టార్స్ గురించి అతడు చేసిన కామెంట్స్ సంచలనం సృష్టించాయి. 

ఉమైర్ సంధు చేసే కామెంట్స్ నమ్మశక్యం కానివి అని, ఆ ట్వీట్స్ లో ఎలాంటి వాస్తవం లేదని నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు. కొన్ని రోజుల క్రితం ఉమైర్ ట్వీట్ చేస్తూ.. పవన్ కళ్యాణ్ ఉమెనైజర్ అని, చాలా మంది స్టార్ హీరోయిన్లతో అతడికి ఎఫైర్స్ ఉన్నాయని కామెంట్స్ చేశాడు. ఆ తర్వాత ఇలయదలపతి విజయ్ ని టార్గెట్ చేస్తూ.. విజయ్, కీర్తి సురేష్ మధ్య ఎఫైర్ సాగుతోంది అంటూ సంచలన ప్రకటన చేశాడు. విజయ్ ఆమెకి కార్లు, బంగ్లాలు కూడా కొనిచ్చినట్లు పేర్కొన్నాడు. 

రీసెంట్ గా కేజిఎఫ్ హీరో యష్ పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. కేజీఎఫ్ షూటింగ్ లో యష్ పలుమార్లు హీరోయిన్ శ్రీనిధిని వేధింపులకు గురి చేశాడు. ఆమెని ఇబ్బందిపెడుతూనే ఉన్నాడు. ఇకపై యష్ తో శ్రీనిధి నటించకూడదు అని నిర్ణయం తీసుకున్నట్లు ఇతడు ప్రకటించడం వైరల్ అయింది. 

🌸🙏🏻🤗 ⭐️ pic.twitter.com/iAo6xCJjU1

— Srinidhi Shetty (@SrinidhiShetty7)

ఇతడి ఫేక్ ప్రచారం ఎక్కువవుతుండడంతో శ్రీనిధి రంగంలోకి దిగింది. సోకాల్డ్ క్రిటిక్ కి గట్టిగా ఇచ్చిపడేసింది. సోషల్ మీడియా అందరికి అందుబాటులో ఉంది. కానీ ఎవరు ఎలా ఉపయోగిస్తున్నారు అనేదే ముఖ్యం. ప్రస్తుతం చాలా మంది సోషల్ మీడియాని తప్పుడు సమాచారం చేరవేసేందుకు ఉపయోగిస్తున్నారు. 

ప్రేమని, సంతోషాన్ని పంచేందుకు సోషల్ మీడియాని ఉపయోగించండి. మరొక్కసారి చెబుతున్నా రాకింగ్ స్టార్ యష్ తో కలసి నటించడం నా అదృష్టం. కేజిఎఫ్ ప్రపంచంలో భాగం అయినందుకు గర్వపడుతున్నా. రాకింగ్ స్టార్ యష్ నిజమైన జెంటిల్ మాన్, నా గురువు , స్నేహితుడు అంటూ ప్రశంసలు కురిపించింది. 

click me!