సౌత్ ఆఫ్రికాలో కమల్ హాసన్ ఇండియన్ 2 షూటింగ్.. భారీ యాక్షన్ ఎపిసోడ్ ప్లాన్ చేస్తున్న డైరెక్ట్ శంకర్

By Mahesh JujjuriFirst Published Mar 17, 2023, 1:27 PM IST
Highlights

ఇండియన్ 2 సినిమా షూటింగ్ ను పరుగులు పెట్టిస్తున్నాడు డైరెక్టర్ శంకర్. కీలక షెడ్యూల్ కోసం  సౌత్ ఆప్రికా వెళ్ళబోతున్న కమల్ హాసన్ టీమ్..అక్కడ కీలక షెడ్యూల్ లో పాల్గోనబోతున్నారు. ఈ షెడ్యూల్ తో చాలా వరకూ షూటింగ్ కంప్లీట్ చేయబోతున్నారు. 

ఎన్నో అవాంతరాలను దాటుకుని.. కాంట్రవర్సీలను తట్టుకుని రీస్టార్ట్ అయ్యింది ఇండియన్ 2 సినిమా.  లాస్ట్ ఇయర్  సెప్టెంబర్‌లో స్టార్ట్ అయిన ఈ  సినిమా షూటింగ్‌ షెడ్యూల్... నాన్ స్టాప్ గా కొనసాగుతోంది. అప్పటికే రామ్ చరణ్ తో సినిమా చేస్తూ.. జోరుమీద ఉన్న శంకర్.. ఈ సినిమా కోసం టైమ్ ను అజస్ట్ చేయాల్సి వచ్చింది. దాంతో రెండు సినిమాలను బ్యాలన్స్ చేస్తూ.. షూటింగ్ చేస్తున్నారు సౌత్ స్టార్ డైరెక్టర్.   ఈక్రమంలో మూవీ టీమ్ త్వరలో  సౌత్ ఆఫ్రికా వెళ్లబోతున్నారు.  అక్కడ ఇంపార్టెంట్ షెడ్యూల్ ను కంప్లీట్ చేసే ప్లాన్ లో ఉన్నారు టీమ్.  

రామ్ చరణ్ తో RC15 తెరకెక్కిస్తున్న శంకర్ .. ఇండియాన్2 సినిమా షూటింగ్ లో కీలక షెడ్యూల్ కోసం.. చరణ్ సినిమాకు హాలీడేస్ ప్రకటించాడు. అటు చరణ్ కూడా ఆస్కార్ హడావిడి ఉండటంతో.. శంకర్ ఆర్ సి 15 కి నెల రోజుల విరామం ప్రకటించి ఆఫ్రికా షూటింగ్ కు వెళ్ళబోతున్నారు. ఈక్రమంలో ఆఫ్రికా షూటింగ్ కు సబంధించి ఓ కీలక అప్ డేట్ బయటకు వచ్చింది. ఈ షెడ్యూల్‌లో కమల్ హాసన్ తో  ట్రైన్‌ నేపథ్యంలో ఓ భారీ యాక్షన్‌ సన్నివేశాలను తెరకెక్కించనున్నారని వినికిడి. అంతే కాకుండా ఈ షెడ్యూల్‌ పూర్తయితే దాదాపు షూటింగ్‌ తుది దశకు చేరుకున్నట్లే అని సమాచారం. 

పాతికేళ్ల క్రితం వచ్చిన భారతీయుడు బాక్సాఫీస్‌ దగ్గర నెలకొల్పిన రికార్డులు అంతా ఇంతా కాదు. అప్పట్లో 50 కోట్ల గ్రాస్‌ కలెక్ట్‌ చేసిన తొలి సినిమాగా సంచలన రికార్డు క్రియేట్‌ చేసింది. అవినీతిని రూపు మాపడానికి ఓ మాజీ ఫ్రీడం ఫైటర్ చేసిన పోరాటం ఈసినిమా ద్వారా చూపించాడు శంకర్. ఈమూవీ అప్పట్లో సంచలనంగా మారింది. ఒక స్వతంత్ర సమరయోధుడు చేసిన పని అందరూ చేయగలిగితే ఇండియా ఎలా ఉంటుంది అనేది అప్పట్లోనే చూపించాడు శంకర్. ఇక ఇననేళ్ళకు  ఈ సినిమాకు సీక్వెల్‌ తెరకెక్కుతుంది. 
ఇటు రామ్ చరణ్ మూవీ కూడా దాదాపు పూర్తి అయ్యింది. ఓ సాంగ్ షూటింగ్ మాత్రం పెండింగ్ ఉందని తెలుస్తోంది. ఈ సాంగ్ కూడా భారీ ఎత్తున షూట్ చేయాలని చూస్తున్నారట టీమ్. దానికోసం కోట్లలో ఖర్చు చేసి.. ఇప్పటికే ఓ సెట్ ను రూపొందిస్తున్నారట టీమ్. ఇండియన్2 షెడ్యూల్ అయిపోగానే శంకర్ చిన్న విరామం తీసుకుని రామ్ చరణ్ సాంగ్ షూట్ లోకి వచ్చే అవకాశం ఉంది. అటు కియారా కూడా పెళ్లి హడావిడి ముగించుకుని తన రెగ్యూలర్ షూటింగ్స్ చేసుకుంటుంది. ఈక్రమంలో రామ్ చరణ్ తో త్వరలో జాయిన్ అయ్యే అవకాశం ఉంది. 

click me!