
బిగ్ బాస్ సీజన్ 6 లో ప్రతీ వారం పరిణామాలు ఎప్పటికప్పుడు మారిపోతున్నాయి. ఈవారం గేమ్స్ తో పాటు ఎంటర్టైన్మెంట్ కూడా ఎక్కువగానే అందింది ఆడియన్స్ కు. ఇక వీకెండ్ ఎపిసోడ్ లో కింగ్ నాగార్జున ఈరోజుహౌస్ మొత్తం చేత ఒకటే గేమ్ ఆడించారు. అది కూడా ఎపిసోడ్ అంతా ఆడించి.. చివరకు హౌస్ లో ఉండే అర్హత ఎవరికి ఏంది..? ఎవరికి లేదు..? ఎవరు ఇంప్రూ చేసుకోవాలి అనేది తేల్చేశాడు. ఒక్కొక్క కంటెస్టెంట్ పిలిచి హౌస్ లో ఉండే అర్హత ఎవరికి ఉంది..? ఎవరికి లేదు అనే విషయంలో అభిప్రాయం తీసుకున్నాడు నాగ్.
ఈరోజు ఎపిసోడ్ అంతా దీనిపైనే నడిచింది. అందులో ముఖ్యంగా హౌస్ లో ఉండేందు అర్హుడు అంటూ.. ఎక్కువ ఓట్లు శ్రీహాన్ కు వేశారు కంటెస్టెంట్స్. ఇక హౌస్ లో ఉండే అర్హత ఎవరికి లేదు అన్న విషయానికి వస్తే.. దాదాపు ఏకగ్రీవంగా మేరీనాకు ఓట్లు పడ్డాయి. పదమూడు మంది ఉన్న హౌస్ లో దాదాపు తొమ్మిది మంది మెరీనాకు ఉండే అర్హత లేదు అని ఓట్ వేశారు.అంతే కాదు మెరీనాకు బాగా క్లోజ్ గా మూవ్ అవుతున్న ఇనాయా, ఫైమ లాంటి వారు కూడా మెరీనాకు వ్యతిరేకంగా ఓటు వేశారు.
ఇక హౌస్ లో ఉండే అర్హత సాధించిన వారిలో ఎక్కువ ఓట్లతో శ్రీహాన్, తరువాత రేవంత్, సూర్య, గీతూలు ఉన్నారు. శ్రీహాన్ కు అత్యధికంగా 9 ఓట్లు పడ్డాయి. దాదాపు హౌస్ అంతా అతను ఇంటో ఉండటానికి అర్హుడు అని తేల్చారు. మరీ ముఖ్యంగా శ్రీహాన్ కు బద్ద శత్రువుగా ఉంటూ వస్తోన్న ఇనయా కూడా సూర్యను వదిలేసి శ్రీహాన్ కు ఓట్ వేసింది. ఇక అనర్హుల లిస్ట్ లో మెరీనాతో పాటు వాసంతి, రాజ్, అర్జున్ కల్యాణ్ కూడా లిస్ట్ లో ఉన్నారు. అనర్హులకుప్రత్యేకంగా బ్యాడ్జ్ లు కూడా అందించాడు బిగ్ బాస్. మీరు ఆట తీరు పెంచుకుని.. నెక్ట్స్ వీక్ వరకూ ఇంప్రూ అవ్వాలన్నారు నాగార్జున.
ఇక ఈక్రమంలోనే రేవంత్, అర్జున్, శ్రీసత్యల మధ్య జరిగిన పప్పు కాంట్రవర్సీని నాగ్ క్లియర్ చేశాడు. ఎవరు మాట తూలారు.. ఎలా రియాక్ట్ అయ్యారు అనేది బేస్ చేసుకుని.. అందరికి క్లాస్ పీకారు. అంతే కాదు ఎప్పుడూ శ్రీసత్యవెనకాలు తిరిగే అర్జున్ కల్యాన్ ను గేమ్ ఆడే విధంగా ప్రోత్సహించాడు నాగార్జున. అంతే కాదు ఫైమాతో ఫన్నీ పంచ్ లు.. రాజ్ చేత రూమ్ లో బిగ్ బాస్ ప్రమాణం కూడా చేయించాడు నాగార్జున. ఈరోజు భారీగా క్లాస్ పీకడాలు. కోపడటలు లాంటివి వేకుండా ప్రశాంతంగా ముగించాడు నాగార్జున.
అంతే కాదు అర్జున్ కళ్యణ్ సొంత స్టాండ్ తీసుకోకపోవడంపై కూడా పెద్ద డిస్కర్షన్ జరిగింది. సూర్య ఇనయా మధ్య చిరుబురుల తో పాటు ఇనయా శ్రీహాన్ ను మెచ్చుకోవడం. సూర్య కోసమే ఇలా చేసిందంటూ వాసంతి చెప్పడం. ఇలా ఫన్నీ వ్యాఖ్యలతో బిగ్ బాస్ వీకెండ్ ఎపిసోడ్ సందడిగా ముగిసింది. అంతే కాదు రేపటి కోసం దివాళీ స్పెషల్ ఈవెంట్ ను ప్లాన్ చేశారు బిగ్ బాస్ మేకర్స్. సెలబ్రిటీ తారల ఆటపాటలు, సినిమా ప్రమోషన్లతో ఆదివారం బిగ్ బాస్ వేదిక అదిరిపోబోతోంది. రేపు సాయంత్ర 6 గంటల నుంచే బిగ్ బాస్ ఈవెంట్ స్టార్ట్ కాబోతోంది.