జపాన్ ప్రజల మనసు దోచుకున్న జూనియర్ ఎన్టీఆర్, జపనీస్ లో మాట్లాడిన RRR హీరో

Published : Oct 22, 2022, 09:33 PM IST
జపాన్ ప్రజల మనసు దోచుకున్న జూనియర్ ఎన్టీఆర్, జపనీస్ లో మాట్లాడిన  RRR హీరో

సారాంశం

జపాన్ ప్రజల మనసు దొచుకున్నాడు ఆర్ఆర్ఆర్ హీరో ఎన్టీఆర్. జపాన్ లో ఆర్ఆర్ఆర్ రిలీజ్ సందర్భంగా మూవీ టీమ్ అక్కడ సందడి చేస్తున్నారు. ఈక్రమంలో తారక్ తాను చాలా స్పెషల్ అని నిరూపించుకున్నాడు.   

జపాన్ లో సందడి చేస్తుంది ట్రిపుల్ ఆర్ మూవీ. ప్రపంచ వ్యాప్తంగా ఆడియన్స్ ను మెస్మరైజ్ చేసిన ఈ సినిమా.. ఇప్పుడు జపాన్ ఆడియన్స్ ను కూడా అలరిస్తోంది. టాలీవుడ్ జక్కన్న రాజమౌళి  డైరెక్షన్ లో జూనియర్ ఎన్టీఆర్ , రాంచ‌ర‌ణ్  కాంబినేషన్ లో తెర‌కెక్కిన‌ పాన్ ఇండియా మూవీ ఆర్ఆర్ఆర్ . మార్చ్ లో రిలీజ్ అయిన ఈ మూవీ ఇండియన్  బాక్సాఫీస్ ను షేక్ చేసి వదిలింది. ఓవర్ సిస్ లో కూడా ఈ సినిమా రికార్డ్స్ క్రియేట్ చేసింది .

ఇక ప్రస్తుతం జాపాన్ లో సందడి చేస్తుంది ఆర్ఆర్ఆర్. తాజాగా శుక్రవారం అనగా అక్టోబరు 21 జపాన్‌లో  రిలీజ్ అయ్యింది మూవీ. జపాన్ లో ఆర్ఆర్ఆర్ ను ప్రమోట్ చేయడం కోసం మూవీ టీమ్ అంతా అక్కడకు వెళ్ళింది. రామ్ చరణ్ తో పాటు ఎన్టీఆర్ ఫ్యామిలీస్ తో కలిసి అక్కడకు వెళ్ళారు. వీరితో పాటు డైరెక్టర్ రాజమౌళి కూడా జపాన్ లో సందడి చేస్తున్నారు. ఈక్రమంలోనే ఎన్టీఆర్ ప్రమోషన్ ఈవెంట్ లో  జపాన్ ప్రజలను మెస్మరైజ్ చేశారు. జపనీస్ లో మాట్లాడి అక్కడి వారిని ఆశ్చర్య పరిచారు. తరక్ జపనీస్ లో ప్రసంగించగానే అక్కడి వారు తెగ ఇంప్రెస్ అయ్యారు. 

అందరికీ నమస్కారం అంటూ మొదలెట్టిన తారక్.  మీరందరూ ఎలా ఉన్నారు. మిమ్మిల్ని కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఆర్ఆర్ఆర్ సినిమాను చూసి ఎంజాయ్ చేయండి అంటూ జపనీస్‌లో భాషలో అన్నారు. ఆతరువాత ఇంగ్లీష్ లో మాట్లాడిన తారక్... మిమ్మల్ని చూడగానే జపాన్ భాషలో మాట్లాడాలని అనిపించింది. ఏవైనా తప్పులుంటే మన్నించండి అన్నారు. నేను జపాన్ లో పర్యటించడం ఇదే మొదటిసారి... ఇలా రావడం.. మిమ్మల్నీ కలుసుకోవడం చాలా అంట చాలా ఎక్జాయిటింగ్ గా ఉంది అన్నారు. నాకు చాలా చెప్పాలి అనిపిస్తుంది కాని.. ఏం చెప్పాలో అర్ధం కావడంలేదు అంటూ.. తన మాటలతో  ఆకట్టుకున్నారు తారక్. 

 

 

అయితే ఎన్టీఆర్ అంటే జపాన్ లో చాలా క్రేజ్ ఉంది. గతంలో కూడా ఎన్టీఆర్ నటించిన చాలా సినిమాలు జపాన్ లో రిలీజ్ అయ్యాయి. అక్కడ ఎన్టీఆర్ కు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. కాని తారక్ ఎప్పుడూ జపాన్ వెళ్ళలేదు. అయితే బాహుబలి తరువాత మన తెలుగు సినిమాలకు అక్కడ మంచి క్రేజ్ ఏర్పడింది. ప్రభాస్ తో పాటు తారక్ లాంటి హీరోల పేరుతో బ్రాండ్స్ కూడా వెలిశాయి అక్కడ.   తాజాగా ఆర్ఆర్ఆర్ సినిమాతో మరోసారి జపాన్ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. 

పీరియాడిక్ డ్రామా నేప‌థ్యంలో వ‌చ్చిన ఆర్‌ఆర్‌ఆర్‌ లో రాంచ‌ర‌ణ్ అల్లూరి సీతారామ‌రాజు పాత్రలో నటించగా.. ఎన్టీఆర్ కొమ్రంభీం పాత్రలో కనిపించారు. అలియాభట్‌, ఒలివియా మోరిస్‌,  హీరోయిన్లు గా నటించిన ఈమూవీలో అజయ్‌ దేవ్‌గన్‌, శ్రియాశరణ్‌, సముద్రఖని కీలక పాత్రలు పోషించారు. డీవీవీ ఎంటర్‌టైన్‌ మెంట్స్‌ బ్యానర్‌పై డీవీవీ దానయ్య  భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను  తెరకెక్కించారు. ప్రపంచ వ్యాప్తంగా ఆర్ఆర్ఆర్ మూవీ వెయ్యి  కోట్లకుపైగా వ‌సూళ్లు రాబ‌ట్టి రికార్డులు సృష్టించింది. 


 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Sanjjanaa Galrani: తన హీరోయిన్ సంజనకే ఝలక్ ఇచ్చిన శ్రీకాంత్.. ఎలా ఎలిమినేట్ చేశాడో తెలుసా ?
Kalyan Padala Winner: కామన్ మ్యాన్‌దే బిగ్‌ బాస్‌ తెలుగు 9 టైటిల్‌.. బిగ్ బాస్‌ చరిత్రలో రెండోసారి సంచలనం