విల్లే పార్లే స్మశానవాటిక చేరుకున్న శ్రీదేవి అంతిమయాత్ర

Published : Feb 28, 2018, 04:04 PM ISTUpdated : Mar 25, 2018, 11:53 PM IST
విల్లే పార్లే స్మశానవాటిక చేరుకున్న శ్రీదేవి అంతిమయాత్ర

సారాంశం

విల్లా పార్లే స్మశానవాటిక చేరుకున్న శ్రీదేవి భౌతిక కాయం మరి కాసేపట్లో అంత్య క్రియలు అంత్య క్రియలకు వేలాదిగా తరలి వచ్చిన అభిమానులు

నుదుట సింధూరం, కళ్లకు కాటుక, పెదాలకు తాంబూలాన్ని మించిన ఎర్రటి లిప్ స్టిక్, మెడలో బంగారు లక్ష్మీదేవి హారం.. అతిలోక సుందరి శ్రీదేవి బతికున్నప్పుడు ఎంత అందగా ముస్తాబయ్యేదో.. అంతే అందంగా తన భౌతిక కాయాన్ని అలంకరించి కడసారి వీడ్కోలుకు ముస్తాబు చేశారు కుటుంబ సభ్యులు.

 

రాత్రి ఇంటికి చేరుకున్న శ్రీదేవిని కడసారి చూపు చూసుకున్న కూతుళ్లు జాహ్నవి, ఖుషి కపూర్, ఇతర కుటుంబసభ్యులు అందంగా ముస్తాబు చేశారు. సెలెబ్రేషన్ స్పోర్ట్స్ క్లబ్ లో సందర్శకుల కోసం వుంచి ఆ తర్వాత తెల్లని పూలతో అందంగా అలంకరించిన వాహనంలో... అంతిమయాత్రకు తీసుకెళ్లారు. కుటుంబ సభ్యులంతా పార్థివదేహానికి నివాళులర్పించి అంతిమయాత్ర ప్రారంభించారు. తెల్లరంగు మల్లెలను అంతిమయాత్ర రథం విలా పార్లే హిందూ హిందూ స్మశానవాటికకు చేరుకుంది. మరి కాసేపట్లో.. అంత్య క్రియలు నిర్వహించనున్నారు.

PREV
click me!

Recommended Stories

Mohanlal: బస్సు జర్నీని గుర్తు చేసుకున్న మోహన్‌ లాల్‌.. అదే తన జీవితాన్ని మార్చేసిందంటూ ఎమోషనల్‌
వరుస హిట్లతో దూసుకుపోతున్న దర్శకులకు చుక్కలు చూపించిన ఫ్లాప్ మూవీస్..ఈ 5 సినిమాల గురించి తెలుసా