మీ అమ్మ లేకపోవడం మంచిదైందన్నారు.. శ్రీదేవి తనయ భావోద్వేగం

Published : Aug 24, 2020, 09:30 PM IST
మీ అమ్మ లేకపోవడం మంచిదైందన్నారు.. శ్రీదేవి తనయ భావోద్వేగం

సారాంశం

దర్శక, నిర్మాత కరణ్‌ జోహార్‌ గైడెన్స్ లో ముందుకు సాగుతుంది. తొలి చిత్రం `ధడక్‌` చిత్రంతో మెప్పించింది. ఇటీవల `గుంజన్‌ సక్సేనా` లోనూ మెరిసింది. ఇందులో తన నటనకు మంచి మార్కులే పడ్డాయి.

`నా మొదటి సినిమా విడుదలైనప్పుడు తీవ్రమైన విమర్శ ఎదురైంది. ఇప్పుడు నీ సినిమా చూసేందుకు మీ అమ్మ లేకపోవడం మంచిదయ్యిందని కొందరు కామెంట్‌ చేశారు` అని చెబుతూ ఎమోషనల్‌ అయ్యింది జాన్వీ కపూర్‌. అతిలోక సుందరి శ్రీదేవి తనయగా బాలీవుడ్‌ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన జాన్వీ కపూర్‌ తనేంటో నిరూపించుకునేందుకు ప్రయత్నిస్తుంది. 

దర్శక, నిర్మాత కరణ్‌ జోహార్‌ గైడెన్స్ లో ముందుకు సాగుతుంది. తొలి చిత్రం `ధడక్‌` చిత్రంతో మెప్పించింది. ఇటీవల `గుంజన్‌ సక్సేనా` లోనూ మెరిసింది. ఇందులో తన నటనకు మంచి మార్కులే పడ్డాయి. అయితే అభిమానులు ఆశించిన స్థాయిలో ఆమె నటన లేదనే విమర్శలు కూడా వచ్చాయి. అంతేకాదు తొలి సినిమా టైమ్‌లో చాలా విమర్శలు వచ్చాయి. 

తాజాగా వీటిపై స్పందించింది. ఓ ఇంటర్వ్యూలో జాన్వీ చెబుతూ, తనపై వచ్చే విమర్శల ప్రభావం తనపై పడకుండా చూసుకుంటానని చెబుతుంది. విమర్శలకు బాధపడనని  చెప్పింది. తన మొదటి సినిమా టైమ్‌లో అనేక విమర్శలు వచ్చాయని, కాకపోతే అవి తనపై ప్రభావం పడకుండా చూసుకున్నానని తెలిపింది. 

అంతేకాదు విమర్శలను సానుకూలంగా తీసుకుని నటనని మెరుగుపర్చుకునేందుకు ప్రయత్నిస్తానని తెలిపింది. ప్రస్తుతం జాన్వీ `రూహి అఫ్జానా`,`దోస్తానా 2` చిత్రాల్లో నటిస్తుంది. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Sobhan Babu `సోగ్గాడు` మూవీతో పోటీ పడి దెబ్బతిన్న ఎన్టీఆర్‌.. శివాజీ గణేషన్‌కైతే చుక్కలే
Illu Illalu Pillalu Today: వల్లి పెట్టిన చిచ్చు, ఘోరంగా మోసపోయిన సాగర్, భర్త చెంప పగలకొట్టిన నర్మద