సుశాంత్‌ కేసు సీబీఐ దూకుడు.. రియా అరెస్ట్ ఖాయమేనా?

Published : Aug 24, 2020, 07:03 PM IST
సుశాంత్‌ కేసు సీబీఐ దూకుడు.. రియా అరెస్ట్ ఖాయమేనా?

సారాంశం

ఈ కేసులోకి సీబీఐ ఎంటరవడంతో వేగం పుంజుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా భావిస్తున్న సుశాంత్‌ ప్రియురాలు రియా చక్రవర్తి అరెస్ట్ కి సన్నాహాలు జరుగుతున్నాయని తెలుస్తుంది. 

బాలీవుడ్‌ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ కేసు అనేక మలుపులు తీసుకుంటోంది. ఆయనది ఆత్మహత్యనా? హత్యనా? అన్నది పెద్ద మిస్టరీగా మారింది. వంట మనిషి ఆత్మహత్యే చేసుకున్నాడని అంటున్నారు. కానీ బీజేపీ నాయకులు ఆయనది హత్య అని అంటున్నారు. దీంతో ఇది పెద్ద మిస్టరీగా మారింది. అయితే సుశాంత్‌ కేసులో సీబీఐ విచారణ చేపడుతుంది.  

ఇదిలా ఉంటే ఈ కేసులోకి సీబీఐ ఎంటరవడంతో వేగం పుంజుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా భావిస్తున్న సుశాంత్‌ ప్రియురాలు రియా చక్రవర్తి అరెస్ట్ కి సన్నాహాలు జరుగుతున్నాయని తెలుస్తుంది. సుశాంత్‌ని సూసైడ్‌ చేసుకునేలా ప్రేరేపించిందని ఆమెపై ఆరోపణలున్నాయి. మరోవైపు సుశాంత్‌ నుంచి రూ.15కోట్లు ఆమె కొట్టేసిందనే ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై ఇప్పటికే ఈడీ అధికారులు ఆమెని విచారించారు. దీంతో ఆమెని పోలీసులు అరెస్ట్ చేసేందుకు రెడీ అవుతున్నట్టు సమాచారం. 

ఇదిలా ఉంటే దీనిపై రియా లాయర్‌ స్పందించారు. సీబీఐ నుంచి తమకు అరెస్ట్ కి సంబంధించి ఎలాంటి నోటీసులు రాలేదని తెలిపారు. నోటిసులు వస్తే విచారణకు హాజరయ్యేందుకు రియా సిద్ధంగా ఉన్నారని తెలిపారు.  మరోవైపు సుశాంత్‌ తండ్రి తరపు లాయర్‌ వికాస్‌ సింగ్‌ స్పందిస్తూ, రియా చక్రవర్తికి త్వరలో సీబీఐ నోటీసులు ఇవ్వనుందని, ఆమె విచారణకు సహకరించకపోతే అరెస్ట్ చేసే అవకాశం ఉందని చెప్పారు. మరోవైపు సుశాంత్‌ ఆత్మహత్య చేసుకునేందుకు ఉన్న అవకాశాలపై విచారణ జరుపుతుంది. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

తనూజతో రొమాంటిక్ మూమెంట్స్, సంతోషంతో పొంగిపోయిన కళ్యాణ్.. సంజనకి ఓజీ రేంజ్ ఎలివేషన్
ఆ స్టార్ హీరో వల్ల కెరీర్ నాశనం చేసుకున్న భూమిక, నగ్మా, స్నేహ ఉల్లాల్.. లిస్టులో మొత్తం ఏడుగురు బాధితులు