శ్రీరెడ్డి పవన్ ను తిట్టింది... ఆ విలన్ ను పొగిడింది

Published : May 06, 2018, 03:36 PM IST
శ్రీరెడ్డి పవన్ ను తిట్టింది... ఆ విలన్ ను పొగిడింది

సారాంశం

శ్రీరెడ్డి పవన్ ను తిట్టింది... ఆ విలన్ ను పొగిడింది

నిన్న మొన్నటి దాకా శ్రీరెడ్డి ఏం మాట్లాడినా, సోషల్ మీడియాలో ఏ పోస్ట్ చేసినా సంచలనమే. కాస్టింగ్ కౌచ్‌పై ఆమె పోరాటం ఆకట్టుకుంది. టీవీ ఛానెళ్లు కూడా ఆమెకు అధిక ప్రాధాన్యం ఇచ్చాయి. ‘మా’ కూడా దిగి వచ్చింది. కానీ ఎప్పుడైతే పవన్ కల్యాణ్‌ను తిట్టిందో.. ఆ విషయాన్ని న్యూస్ ఛానెళ్లు పదే పదే ప్రసారం చేశాయో సీన్ మారిపోయింది. పవన్ ఆగ్రహం, తదనంతర కారణాలతో టీవీ ఛానెళ్లు ఆమెకు ముఖం చాటేశాయి. ఒకప్పుడు గంటల తరబడి డిబేట్లు పెట్టిన ఛానెళ్లే శ్రీరెడ్డికి నామ మాత్రంగా కవరేజీ ఇస్తున్నాయి.

దీంతో శ్రీరెడ్డి ఇక సోషల్ మీడియా వేదికగానే తన అభిప్రాయాలను వెల్లడిస్తోంది. తాజాగా ఆమె మరోసారి జనసేనానిని టార్గెట్ చేస్తూ ఫేస్‌బుక్‌లో పోస్టులు పెట్టింది. కెమెరా గంగతో రాంబాబు సినిమాలో పవన్ కల్యాణ్, ప్రకాష్ రాజ్ మధ్య మీడియా విషయమై వచ్చే సన్నివేశాన్ని శ్రీరెడ్డి ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసింది. మీడియా పవర్ ఎక్సలెంట్ సీన్, కట్ చేస్తే.. సీన్ రివర్స్. ప్రకాష్ రాజ్ గారు పోరాడుతున్నారు. రియల్ హీరో ప్రకాష్ రాజ్ అంటూ విలక్షణ నటుణ్ని పొగుడుతూనే.. సీన్ రివర్స్ అనడం ద్వారా పరోక్షంగా పవన్‌‌పై సెటైర్లు వేసింది. 

PREV
click me!

Recommended Stories

బాలకృష్ణ కెరీర్ లో ఎన్టీఆర్ వల్ల డిజాస్టర్ అయిన సినిమా ఏదో తెలుసా? దర్శకుడు ఎంత చెప్పినా రామారావు ఎందుకు వినలేదు?
Gunde Ninda Gudi Gantalu Today: ఏం ఫ్యామిలీ రా బాబు... ఒకరికి తెలియకుండా మరకొరు, మంచాలా మనోజ్ కి బాలు చెక్