ఎన్నికల ఫలితాలపై శ్రీరెడ్డి జోస్యం.. సీఎం ఆయనేనట!

Published : May 11, 2019, 11:31 AM IST
ఎన్నికల ఫలితాలపై శ్రీరెడ్డి జోస్యం.. సీఎం ఆయనేనట!

సారాంశం

మరో రెండు వారాల్లో ఏపీ ఎన్నికల ఫలితాలు రాబోతున్నాయి.. దీంతో ఏపీ రాజకీయనాయకుల్లో టెన్షన్ నెలకొంది. 

మరో రెండు వారాల్లో ఏపీ ఎన్నికల ఫలితాలు రాబోతున్నాయి.. దీంతో ఏపీ రాజకీయనాయకుల్లో టెన్షన్ నెలకొంది. ఒక్కొక్కరూ ఒక్కో లెక్క చెబుతూ ఎవరు గెలుస్తారో జోస్యం చెబుతున్నారు. నటి శ్రీరెడ్డి మాత్రం తన మద్దతు జగన్ ని తెలుపుతూ.. ఆయన వచ్చి అందరి లెక్కలు తేల్చాలని అంటోంది.

సోషల్ మీడియాలో తన పోస్ట్ లతో అగ్గిరాజేసే శ్రీరెడ్డి ఎన్నికల ఫలితాల నేపధ్యంలో మరికొన్ని కామెంట్స్ చేసింది. జగన్ ఫోటోని షేర్ చేస్తూ.. 'మీరు రావాలి, అందరి లెక్కలు సరి చేయాలి. కావాలి జగన్... రావాలి జగన్.. ఎవ్వరి శత్రుశేషం ఉంచొద్దు' అంటూ కామెంట్స్ చేసింది. 

గతంలో కూడా జగన్ కి అనుకూలంగా సోషల్ మీడియాలో కొన్ని పోస్ట్ లు పెట్టింది శ్రీరెడ్డి. రాష్ట్రానికి కొత్త నాయకుడు వస్తే.. ఉపయోగం ఉంటుందని చాలా మంది జగన్ వైపు మొగ్గు చూపుతున్నారని అభిప్రాయ పడింది. 

చంద్రబాబు పాలనలో చాలా మంది విసిగిపోయిన వారు ఉన్నారని, తెలుగుదేశం పార్టీలోని కొంతమంది ఎమ్మెల్యేలు చేసిన పొరపాట్లు జగన్ కి కలిసి వస్తున్నాయని, పాదయాత్రతో జగన్ కి చాలా మంది జనం దగ్గరయ్యారని, ఇవన్నీ చూసుకుంటే వైఎస్సార్ సీపీ అధికారంలోకి రావడానికి 60 శాతం ఛాన్స్ ఉండగా.. టీడీపీకి 40 శాతం అవకాశాలు ఉన్నాయంటూ  జోస్యం చెప్పుకొచ్చింది. 

PREV
click me!

Recommended Stories

RJ Charan: చరణ్ రీఎంట్రీ అదిరిందిగా, పరువు తీసుకున్న రామ్ ప్రసాద్.. వర్షిణి లవ్ ట్రాక్ మొదలైందా
Dhanush Wishes PM Modi: ధనుష్ ఒక్క ట్వీట్‌తో రేగిన పొలిటికల్ రచ్చ..విజయ్ అభిమానుల ట్రోలింగ్