'సాహో'ని ఫ్లాప్ అంటోంది పవన్ ఫ్యాన్సే.. శ్రీరెడ్డి కామెంట్స్!

Published : Aug 30, 2019, 12:16 PM ISTUpdated : Aug 30, 2019, 12:19 PM IST
'సాహో'ని ఫ్లాప్ అంటోంది పవన్ ఫ్యాన్సే.. శ్రీరెడ్డి కామెంట్స్!

సారాంశం

ఎక్కడ ఎవరు ఎందుకు ఏమన్నా.. అది తిప్పి తిప్పి పవన్ కళ్యాణ్ దగ్గరకు, వాళ్ల ఫ్యాన్స్‌ దగ్గరకు తీసుకురావడం అలవాటుగా చేసుకున్న ఆమె మళ్లీ పవన్ ఫ్యాన్స్‌ని ఎటాక్ చేస్తుంది.  

రెండున్నరేళ్ల పాటు కష్టపడి పని చేసి.. సినిమా మీద నమ్మకంతో రూ.350 కోట్లు ఖర్చు పెట్టి మరీ 'సాహో' చిత్రాన్ని రూపొందించారు. అభిమానులు ఎంతగానో ఎదురుచూసిన ఈ సినిమా ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 

సుజీట్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా కోసం హాలీవుడ్ నిపుణులు పని చేశారు. హైటెక్నికల్ వాల్యూస్ తో రూపొందిన ఈ సినిమాపై సోషల్ మీడియాలో నెగెటివ్ కామెంట్స్ చేస్తున్నారు. వీటిని ప్రభాస్ ఫ్యాన్స్ పెద్దగా పట్టించుకోవడం లేదు. తమ అభిమాన హీరోని తెరపై చూసుకుంటూ నెగెటివ్ కామెంట్స్ సంగతి మర్చిపోయారు.

ఈ కామెంట్స్ ని తన వివాదం కోసం వాడుకుంటోంది సినీ నటి శ్రీరెడ్డి. 'సాహో' సినిమా ఎలా ఉందని..? పోస్ట్ పెట్టిన ఈమె.. సినిమా ఫ్లాప్ అని చాలా మంది కామెంట్స్ చేస్తున్నారని.. వాళ్లు ఎవరో తనకు తెలుసునని.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పనిగట్టుకొని మరీ సినిమాపై ఫ్లాప్ కామెంట్స్ చేస్తున్నారని సోషల్ మీడియాలో రాసుకొచ్చింది.

పవన్ ఫ్యాన్స్ ని ఉద్దేశిస్తూ.. 'మీరు మారరా..? ప్రభాస్ సినిమాపై పడి ఏడుస్తున్నారు..' అంటూ తనదైన భాషలో మండిపడింది. సోషల్ మీడియాలో చాలా మంది పవన్ ఫ్యాన్స్ ప్రభాస్ ని విష్ చేస్తూ పోస్ట్ లు పెడుతున్నారు. మరి ఆ పోస్ట్ లు శ్రీరెడ్డి కంటపడినట్లు లేవు! 

PREV
click me!

Recommended Stories

AK 47 Teaser Review: ఫ్యామిలీ ఇమేజ్‌ని పక్కన పెట్టిన వెంకటేష్‌, ఎందుకంటే?.. ఆదర్శ కుటుంబ టీజర్‌ ఎలా ఉందంటే?
Tollywood Senior Heroes: దసరా నుంచి సంక్రాంతి వరకు, క్యూ కట్టిన సీనియర్ హీరోలు..300 కోట్లు కొట్టే బొమ్మ ఏది ?