అమ్మో శ్రీసత్యను నలిపేసిన మెహబూబ్... జడ్జెస్ మైండ్ బ్లాక్!

By Sambi ReddyFirst Published Jan 25, 2023, 11:28 AM IST
Highlights


బీబీ జోడి వేదికపై శ్రీసత్యను మెహబూబ్ నలిపేశాడు. హై ఎనర్జిటిక్ సాంగ్ కి అంతకు మించి ఎలెక్ట్రిఫైయింగ్ పెర్ఫార్మన్స్ ఇచ్చారు. 
 

బిగ్ బాస్ షో తెలుగు మాజీ కంటెస్టెంట్స్ తో బీబీ జోడి పేరుతో డాన్స్ రియాలిటీ షో స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. పలువురు కంటెస్టెంట్స్ జోడీలుగా ఏర్పడి డాన్స్ షోలో పార్టిసిపేట్ చేస్తున్నారు. హీరోయిన్ సదా, సీనియర్ నటి రాధ జడ్జెస్ గా వ్యవహరిస్తున్నారు. ప్రొఫెషనల్స్ కి ఏమాత్రం తగ్గకుండా డాన్స్ పెర్ఫార్మన్స్ ఇస్తున్నారు.చూస్తుంటే బీబీ జోడి భారీ ఆదరణ దక్కించుకోవడం ఖాయంగా కనిపిస్తుంది. ఒక జోడీని మించిన పెర్ఫార్మన్స్ మరొక జోడీ ఇస్తున్నారు. 

దీంతో కంటెస్టెంట్స్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. మెహబూబ్-శ్రీసత్య ఒక జంటగా పార్టిసిపేట్ చేస్తున్నారు. లేటెస్ట్ ఎపిసోడ్లో మల్లన్న చిత్రంలోని 'అలెగ్రా అలెగ్రా' సాంగ్ కి పెర్ఫార్మ్ చేశారు. శ్రీసత్య షార్ట్ ఫ్రాక్ ధరించి కేక పుట్టించింది. ఆమె స్టెప్స్ మెస్మరైజ్ చేశాయి. శ్రీసత్యలో ఈ రేంజ్ టాలెంట్ ఉందా అని ఆడియన్స్ ఆశ్చర్యపోతున్నారు. ఇక అద్భుతమైన డాన్సర్ అయిన మెహబూబ్ ఆమెకు గట్టిపోటీ ఇచ్చాడు. కాగా ఆమెను అటు ఇటు తిప్పుతూ తన కండల్లో నలిపేశాడు. 

మెహబూబ్-శ్రీసత్య అలెగ్రా అలెగ్రా సాంగ్ కి మమేకమై డాన్స్ చేశారు. వారి డాన్స్ జడ్జెస్ ని సీట్లలో కూర్చోలేకుండా చేసింది బీబీ జోడి పెర్ఫార్మన్స్ లో హైలెట్ గా శ్రీసత్య-మెహబూబ్ డాన్స్ నిలిచింది. కాగా మెహబూబ్ సీజన్ 4 లో పాల్గొని పాపులారిటీ రాబట్టారు. ఆయన సోషల్ మీడియా సెలబ్రిటీ హోదాలో అడుగుపెట్టి ఫేమ్ తెచ్చకున్నాడు. స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా చాలా వారాలు హౌస్లో ఉన్నాడు. ఇక శ్రీసత్య సీజన్ 6 లో పాల్గొన్న విషయం తెలిసిందే. అనూహ్యంగా శ్రీసత్య మిడ్ వీక్ ఎలిమినేషన్ ద్వారా బయటకు వచ్చారు. ఫైనల్ లో పాల్గొనే ఛాన్స్ కోల్పోయారు. ఈ సీజన్లో అత్యంత నెగిటివిటీ మూటగట్టుకున్న కంటెస్టెంట్ శ్రీసత్య అని చెప్పొచ్చు. 
 

click me!