ఫెయిల్యూర్స్ నన్ను చాలా మార్చాయి: శ్రీను వైట్ల

By Prashanth MFirst Published Nov 13, 2018, 4:12 PM IST
Highlights

టాలీవుడ్ లో మంచి ఎంటర్టైన్ చిత్రాలను అందించే అగ్ర దర్శకుల్లో ఒకరైన శ్రీనువైట్ల గత కొంత కాలంగా వరుసగా అపజయాలను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సారి ఆయన ఎవరు ఊహించని విధంగా రవితేజను మూడు విభిన్న పాత్రల్లో పరిచయం చేస్తూ అమర్ అక్బర్ ఆటోని సినిమాతో రానున్నారు. ఆ సినిమా ఈ నెల 16న రిలీజ్ కానుంది.   

సినిమాలో ముగ్గురు రవితేజలు ఉంటారా? లేక ఒక్క పాత్రనే అమర్ అక్బర్ ఆంటోని గా కనిపిస్తుందా అనేది సినిమా చూసి తెలుసుకోవాలని అంటున్నారు దర్శకుడు శ్రీను వైట్ల. ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన సినిమాకు సంబందించిన కొన్ని విషయాలు తెలిపారు. అదే విధంగా తన ఓటముల గురించి ప్రస్తావించారు. 

ఆయన మాట్లాడుతూ.. వరుస ఫెయిల్యూర్స్ నన్ను చాలా మార్చాయి. ఓ విధంగా మరింత స్ట్రాంగ్ చేసినట్లు చెప్పవచ్చు. మిస్టర్ డిజాస్టర్ అనంతరం కొంచెం గ్యాప్ తీసుకున్నా. ఎలాగైనా ఒక ఫ్రెష్ కథతో రావాలని అలోచించి నూతన రచయితలతో దాదాపు 8 నెలలు కూర్చొని అమర్ అక్బర్ ఆంటోని కథను రూపొందించా. సినిమా కథ రాస్తున్నపుడే కథకు కరెక్ట్ గా సెట్ అయ్యే కథానాయకుడు రవితేజ అని ఫిక్స్ అయ్యాం.

ఆడియెన్స్ కి ఏ మాత్రం బోర్ కొట్టకుండా సినిమా ఎంటర్టైన్ చేస్తుందనే నమ్మకం ఉంది. మైత్రి మూవీ మేకర్స్ వారు సినిమాను నిర్మించడం ప్రధాన బలం. అమెరికాలో సన్నివేశాలు అద్భుతంగా రావడానికి వారు చాలా కృషి చేశారు. ఇక ఇలియానను హీరోయిన్ గా ఎంచుకోవడానికి కూడా ఒక కారణం ఉందని సినిమా చుస్తే ఆ విషయం పూర్తిగా అర్థమవుతుందని శ్రీను వైట్ల వివరణ ఇచ్చారు.

click me!