బిగ్ బాస్ 3: వామ్మో.. శ్రీముఖి పారితోషికం అంతా..!

By tirumala ANFirst Published Jul 30, 2019, 4:26 PM IST
Highlights

కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ షో తొలివారం పూర్తి చేసుకుని రెండవ వారంలోకి ఎంటర్ అయింది. బిగ్ బాస్ సీజన్ 3 మొత్తం సెలెబ్రిటీ కంటెస్టెంట్స్ తో నిండిపోయింది. శ్రీముఖి, వరుణ్ సందేశ్, వితిక, శివజ్యోతి, జాఫర్ లాంటి ప్రముఖ సెలెబ్రిటీలు ఈ షోలో పాల్గొంటున్నారు. 

వీరిలో శ్రీముఖి పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. యాంకర్ గా శ్రీముఖి బుల్లితెరపై చేసే సందడి అంతా ఇంతా కాదు. కొన్ని చిత్రాల్లో కూడా నటించింది. శ్రీముఖికి ఉన్న కేజ్ దృష్ట్యా బిగ్ బాస్ హౌస్ లో అందరికన్నా ఆమెకే ఎక్కువ పారితోషికం చెల్లిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

బిగ్ బాస్ నిర్వాహకులు శ్రీముఖికి 3.5 కోట్ల రెమ్యునరేషన్ చెల్లిస్తున్నారట. అంటే వంద రోజుల షోలో ఆమెకు ఒక్కో రోజుకు 3.5 లక్షలు చెల్లిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ రెమ్యునరేషన్ సౌత్ లో స్టార్ హీరోయిన్స్ అందుకునే పారితోషికం కంటే ఎక్కువ. 

ఇక బిగ్ బాస్ హౌస్ లో శ్రీముఖి తనదైన శైలిలో రచ్చ చేయడం ప్రారంభించింది. అందరిని డామినేట్ చేసి అటెన్షన్ పొందాలని శ్రీముఖి ప్రయత్నిస్తున్నట్లు సోషల్ మీడియాలో కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. సెకండ్ వీక్ లో శ్రీముఖి ఎలిమినేషన్ ప్రక్రియలో భాగంగా నామినేట్ అయింది. 

click me!