'క్రాక్' క్లోజింగ్ కలెక్షన్స్ (ఏరియావైజ్)

By Surya PrakashFirst Published Feb 24, 2021, 6:40 PM IST
Highlights

కరోనా తో మూతపడిన థియేటర్స్ ని క్రాక్ తెరిపించి,దుమ్ము రేపింది. అంతకు ముందు కొన్ని సినిమాలు రిలీజైనా పెద్దగా వర్కవుట్ కాలేదు. అయితే క్రాక్ లో ఉన్న కిక్ ఇచ్చే కంటెంట్ తో బాక్సాఫీసు బ్రద్దలైంది. దానికి తోడు సంక్రాంతి సినిమాలు పెద్దగా వర్కవుట్ కాకపోవటంతో క్రాక్ దూసుకుపోయింది.  ఫిప్టీ పర్శంట్ సీటింగ్ కెపాసిటీతోనూ అద్భుతమైన రికార్డులు సొంతం చేసుకుని ఫైనల్ రన్ ని పూర్తి చేసుకుంది. 

అక్కడక్కడా కొన్ని కేంద్రాల్లో ఉన్నప్పటికీ కొత్త చిత్రాలు వచ్చిన నేపథ్యంలో కలెక్షన్లు దాదాపు క్లైమాక్స్ కార్డ్ పడిపోయింది. అందులోనూ ఆహాలో డిజిటల్ స్ట్రీమింగ్ జరిగిపోవడంతో వివిధ మార్గాల్లో మిగిలిన జనం  చూసేశారు. త్వరలో స్టార్ మా ఛానల్ లో వరల్డ్ ప్రీమియర్ ఉంది.

మొత్తానికి తేలిందేమిటంటే...రవితేజ కి సూపర్ హిట్ పడింది. మాస్ మహారాజ్ రవితేజ – శృతి హాసన్ జంటగా గోపిచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన క్రాక్  క్లోజింగ్ కలెక్షన్స్ ఫిగర్ బయటికి వచ్చింది. క్రాక్ క్లోసింగ్ కలెక్షన్స్ ఏరియాల వారీగా..  
ఏరియా        కోట్లలో

ఏరియా    షేర్

నైజాం    12.47cr
సీడెడ్    6.24cr
ఉత్తరాంధ్ర    4.79cr
గుంటూరు    2.81cr
క్రిష్ణ    2.38cr
ఈస్ట్ గోదావరి    3.29cr
వెస్ట్ గోదావరి    2.34cr
నెల్లూరు    1.79cr
ఆంధ్ర+తెలంగాణా    36.11cr
ఓవర్సీస్    0.90cr
ప్రపంచవ్యాప్తంగా    39.16cr

క్రాక్ సక్సెస్ తో రవితేజ తాను కమిటవ్వబోయే ప్రాజెక్టులను మరోసారి రివైజ్ చేసుకుని జాగ్రత్తగా సైన్ చేస్తున్నారు. ఇంత పెద్ద సక్సెస్ కొట్టడంతో మాస్ మహారాజా అభిమానులు ఆనందం మాములుగా లేదు. సీటింగ్ లిమిటేషన్ మధ్య కూడా ఇలాంటి వసూళ్లు తేవడం పట్ల గర్వంగా ఫీలవుతున్నారు. మళ్ళీ మే 28 దాకా ఖిలాడీ కోసం వెయిట్ చేయాల్సిందే.

click me!