కష్టం విలువ తెలిసిన వాడే సాయం చేస్తాడు.. వైరల్ అవుతున్న సోనూ ఫోటో

By Satish ReddyFirst Published May 30, 2020, 10:55 AM IST
Highlights

కరోనా ప్రభావం మొదలైన వెంటనే ముంబైలోని హోటెల్‌ను కరోనా రోగుల కోసం ఇచ్చేసిన సోనూసూద్‌, తరువాత వలస కూలీల విషయంలో పెద్ద యుద్ధమే చేస్తున్నాడు. ఇప్పటికే తన సొంత ఖర్చులతో 12 వేల మందికి పైగా ప్రజలను సృస్థలాలకు చేర్చాడు.

ప్రస్తుతం కరోనా కారణంగా సినీ రంగం తీవ్ర సంక్షోబాన్ని ఎదుర్కొంటోంది. లాక్‌ డౌన్‌ కారణంగా సినిమాలకు సంబంధిచిన అన్ని కార్యక్రమాలు ఆగిపోవటంతో సినీ ప్రముఖులంతా ఇళ్లకే పరిమితమయ్యారు. కొంత మంది సినీ తారలు లాక్‌ డౌన్ సమయాన్ని హాలీడేస్‌లా ఎంజాయ్ చేస్తుంటే.. మరికొందరు మాత్రం సేవ కార్యక్రమాల్లో తలమునకలవుతున్నారు. అలా ఒక్కసారిగా అందరి దృష్టిలో సూపర్‌ హీరోగా మారిన నటుడు సోనూ సూద్‌.

కరోనా ప్రభావం మొదలైన వెంటనే ముంబైలోని హోటెల్‌ను కరోనా రోగుల కోసం ఇచ్చేసిన సోనూసూద్‌, తరువాత వలస కూలీల విషయంలో పెద్ద యుద్ధమే చేస్తున్నాడు. ఇప్పటికే తన సొంత ఖర్చులతో 12 వేల మందికి పైగా ప్రజలను సృస్థలాలకు చేర్చాడు. కేవలం ముంబై నుంచే కాదు, తాజాగా కేరళలో చిక్కకున్న వారి కోసం చార్టెడ్‌ ఫ్లైట్‌ను ఏర్పాటు చేసిన మరి వారిని స్వస్థలాలకు చేర్చాడు సోనూ. ఈ కార్యక్రమాలతో సోనూపై ప్రశంసల జల్లు కురుస్తోంది.

తాజాగా సోనూ సూద్‌కు సంబంధించిన మరో ఆసక్తికర విషయం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సోనూసూద్ వయసు 24 సంవత్సరాలు ఉన్న సమయంలో ముంబైలోని బొరివాలి నుంచి చర్చిగేట్ వరకు ప్రయాణించేందుకు రైల్వే డిపార్ట్‌మెంట్ ఆయన పేరుతొ ఓ ఐడీ కార్డును, మంత్లీ పాస్‌ను జారీ చేసింది. 1998 మార్చి 6 ఇష్యూ చేసిన ఈ పాస్ ధర 420 రూపాయలు. ఈ పాస్‌ ఫోటోను సోషల్ మీడియా పేజ్‌లో షేర్  చేసిన వ్యక్తి ఫోటోతో పాటు నిజంగా కష్టపడే వాడే ఎదుటివారి బాధను అర్థం చేసుకొని సాయం చేస్తాడు` అంటూ కామెంట్ చేశాడు.

click me!