సోనూసూద్ పై ట్రోలింగ్, ఈ కార్టూన్ కారణం

Surya Prakash   | Asianet News
Published : May 13, 2021, 01:45 PM ISTUpdated : May 13, 2021, 05:50 PM IST
సోనూసూద్ పై ట్రోలింగ్, ఈ కార్టూన్ కారణం

సారాంశం

ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ విజృంభణతో ఇప్పుడు మరోసారి  దేశ జనాలకి అతను అండగా నిలుస్తున్నాడు. నార్త్ సౌత్ అని తేడా లేకుండా ఆయన దేశవ్యాప్తంగా సేవలను విస్తరించాడు.  

 సోనూ సూద్ తను చేసే సహాయ చర్యలతో గత కొన్నాళ్లుగా ఈయన వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. అలాగే కరోనా సమయంలో ఆపదలో ఉన్న వాళ్లను ఆదుకుంటూ  నిజమైన ఆపద్భాందవుడు అనిపించుకున్నారు. ముఖ్యంగా కరోనా సందర్భంగా ఏర్పడ్డ లాక్‌డౌన్ కారణంగా ఎక్కడికక్కడ చిక్కుకు పోయిన కార్మికులను వాళ్ల స్వస్తలాలకు వెళ్లేలా స్పెషల్ బస్సులు ఏర్పాటు చేసి మనసుల్లో దేవుడు అయ్యారు. అలాగే కొంత మంది కోసం ఏకంగా ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేసి ప్రభుత్వాలు సైతం చేయలేని సాయాన్ని చేసి నిజమైన హీరో అనిపించుకున్నారు. 

ఈ క్రమంలో కొంత మందికి ఉద్యోగాలు కూడా కల్పించారు. మరికొంతమందికి ఇప్పటికే చదువుకునే ఆర్ధిక స్థోమత లేని వాళ్లకు సొంతంగా స్కాలర్ షిప్ ఏర్పాటు చేసారు. సోనూ సూద్ సాయం పొందిన వాళ్లు కొంత మంది ఏకంగా తమ పుట్టిన బిడ్డలకు సోనూ పేరు పెట్టుకునే స్దాయికి వెళ్లారు. ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ విజృంభణతో ఇప్పుడు మరోసారి  దేశ జనాలకి అతను అండగా నిలుస్తున్నాడు. నార్త్ సౌత్ అని తేడా లేకుండా ఆయన దేశవ్యాప్తంగా సేవలను విస్తరించాడు.

సోనూ సోదూ పై నమ్మకం ఏ స్దాయికి వెళ్లిందంటే...సెలబ్రెటీలకు సైతం బెడ్స్, ఆక్సిజన్, అత్యవసర మందులు లాంటి వాటి అవసరం పడితే సోనూను ట్యాగ్ చేసి రిక్వెస్ట్‌లు పెట్టి తమ సమస్యను పరిష్కరించుకోగలుగుతున్నారు.ఇక ఇలా తమ టీమ్ ద్వారా చేస్తున్న మంచి పనుల గురించి సోనూ సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు అప్‌డేట్లు కూడా ఇస్తున్నాడు. అంతవరకూ బాగానే ఉంది. అయితే ఆయన సోషల్ మీడియాలో షేర్ చేసే కార్టూన్స్  ట్రోలింగ్ కు గురి అవుతున్నాయి.

తాజాగా సోనూ సోషల్ మీడియా పేజీలో ఒక కార్టూన్ షేర్ చేసారు. ఈ రోజు ఆక్సిజన్ కొనుగోలు చేసి, 200 మందికి వారి ఇళ్లకే అందించబోతున్నట్లు సోనూ చెబుతుంటే.. భరత మాత అతడికి దండం పెడుతూ.. “నిన్ను చూసి గర్విస్తున్నాను కుమారా.. నీకు ఎప్పటికీ రుణపడి ఉంటా. నువ్వు నిజ జీవిత హీరోవి” అంటున్నట్లుగా ఆ కార్టూన్ లో ఉంది.

అయితే ఇది చూసినవారంతా ..మరీ భరతమాత సోనూకు దండం పెట్టి నీకు రుణపడి ఉంటా అనడం  అతిగా అనిపిస్తోందంటున్నారు. అయితే దీన్ని సోనూ సోషల్ మీడియాలో ఎక్కౌంట్ లో షేర్ చేయటం ట్రోలింగ్ అవకాసం ఇచ్చినట్లైంది.
 

PREV
click me!

Recommended Stories

Emmanuel lover ఎవరో తెలుసా? డాక్టర్ ను పెళ్లాడబోతున్న బిగ్ బాస్ 9 టాప్ కంటెస్టెంట్
Bigg Boss telugu 9 బోరుమని ఏడ్చిన రీతూ, బయటకు వెళ్తూ బాంబ్ పేల్చిన కంటెస్టెంట్