అమితాబ్‌, అక్షయ్‌లను వెనక్కి నెట్టిన సోనూ సూద్

Published : Jul 05, 2020, 12:34 PM IST
అమితాబ్‌, అక్షయ్‌లను వెనక్కి నెట్టిన సోనూ సూద్

సారాంశం

తన హోటల్‌ను వైద్య సింబ్బంది కోసం ఉచితంగా ఇచ్చిన సోనూ, గత కొద్ది రోజులుగా పూర్తిగా ప్రజా సేవకే అంకితమయ్యాడు. లక్షల రూపాయల ఖర్చు చేస్తూ ప్రజాసేవలో గడుపుతున్నాడు. తెర మీద విలన్‌గా బ్యాడ్‌ ఇమేజ్ సొంతం చేసుకున్న సోనూ సూద్‌ రియల్‌ లైఫ్‌లో మాత్రం ది బెస్ట్ రియల్‌ హీరో అనిపించుకున్నాడు.

కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ నేపథ్యంలో సెలబ్రిటీలు ప్రముఖలు ఎవరికీ తోచినంత వారు సాయం చేస్తున్నారు. కొంత మంది డబ్బు రూపంలో సాయం చేస్తుండగా మరికొందరు వారే స్వయంగా సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో బాలీవుడ్ నటుడు స్టార్ విలన్ సోనూ సూద్‌ తన వంతుగా సేవ కార్యక్రమాలు చేపట్టాడు. వేలాది మందికి రోజు ఆహారం అందించటంతో పాటు వందల బస్సుల్లో వలస కూలీలను స్వస్థలాలకు చేర్చాడు. ఇన్నేళ్లుగా సినిమాల్లో నటిస్తున్నా రాని పేరు సోనూకు ఈ రెండు నెలల కాలంలోనే వచ్చింది.

తన హోటల్‌ను వైద్య సింబ్బంది కోసం ఉచితంగా ఇచ్చిన సోనూ, గత కొద్ది రోజులుగా పూర్తిగా ప్రజా సేవకే అంకితమయ్యాడు. లక్షల రూపాయల ఖర్చు చేస్తూ ప్రజాసేవలో గడుపుతున్నాడు. తెర మీద విలన్‌గా బ్యాడ్‌ ఇమేజ్ సొంతం చేసుకున్న సోనూ సూద్‌ రియల్‌ లైఫ్‌లో మాత్రం ది బెస్ట్ రియల్‌ హీరో అనిపించుకున్నాడు. ఈ నేపథ్యంలో ఇండియన్‌ ఇన్సిస్టిట్యూట్‌ ఆఫ్‌ హ్యామన్‌ బ్రాండ్స్‌ సంస్థ ఓ సర్వే నిర్వహించింది.

ఈ విపత్కర పరిస్థితుల్లో సేవలు అందించిన ప్రముఖులో ఎవరు బెస్ట్ అన్న లెక్కలు తేల్చింది సదరు సంస్థ. అయితే ఈ ఈ లిస్ట్‌లో బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌, సూపర్‌ స్టార్‌ అక్షయ్‌ కుమార్‌లను వెనక్కి నెట్టి టాప్‌ ప్లేస్‌లో నిలిచాడు సోనూ సూద్‌. అక్షయ్ రెండో స్థానంతో, అమితాబ్‌ మూడో స్థానంతో సరిపెట్టుకున్నారు. ఇప్పటికే సోనూ సూద్‌కు ప్రభుత్వ గౌరవాలు దక్కాలన్న వాదన ఊపందుకుంటుండగా తాజా సర్వేతో ఆ వాదనకు మరింత బలం చేకూరనుంది.

PREV
click me!

Recommended Stories

Illu Illalu Pillalu Today Episode Jan 20: బల్లి అక్కకి మూడింది.. ప్రేమ, నర్మద ఫోకస్ మొత్తం వల్లిపైనే
Pooja Hegde కారవాన్‌లోకి వెళ్లిన పాన్‌ ఇండియా హీరో ఎవరు.. కావాలనే బ్యాడ్‌.. పూజా టీమ్‌ చెప్పిన నిజం ఏంటంటే