నా పాత్రను ఎక్కువగా కట్ చేశారని..ఏడుస్తూనే క్లారిటీ ఇచ్చింది

Published : Feb 23, 2018, 09:05 PM ISTUpdated : Mar 25, 2018, 11:59 PM IST
నా పాత్రను ఎక్కువగా కట్ చేశారని..ఏడుస్తూనే క్లారిటీ ఇచ్చింది

సారాంశం

ప్యాడ్ మ్యాన్ చిత్రం అందరిని ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యింది. సినిమాకు కలెక్షన్స్ కూడా బాగానే అందుతున్నాయి నా పాత్రను ఎక్కువగా కట్ చేశారని..ఏడుస్తూనే క్లారిటీ ఇచ్చింది

రీసెంట్ గా బాలీవుడ్ లో వచ్చిన ప్యాడ్ మ్యాన్ చిత్రం అందరిని ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యింది. సినిమాకు కలెక్షన్స్ కూడా బాగానే అందుతున్నాయి. అక్షయ్ కుమార్ మరో ప్రయోగంతో సక్సెస్ అయ్యాడని సినీ ప్రముఖులు ప్రశంసలను కురిపిస్తున్నారు. అయితే ఈ సినిమాలో అక్షయ్ తో పాటు రాధికా ఆప్తే - సోనమ్ కపూర్ కూడా నటించారు. సోనమ్ స్పెషల్ క్యారెక్టర్ చాలా వర్కౌట్ అయ్యింది. 

అయితే సోనమ్ చేసిన స్పెషల్ రోల్ నిడివి చాలా వరకు తగ్గించేశారని ముందే కొన్ని కామెంట్స్ వచ్చాయి. అయితే ఆ విషయంపై ఆ బ్యూటీ కూడా క్లారిటీ ఇచ్చింది. ఓ విధంగా పాజిటివ్ గానే స్పందిస్తూ.. నా పాత్రను ఎక్కువగా కట్ చేశారని లోలోపల ఏడ్చేసింది. రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో సోనమ్ కపూర్ తన పాత్ర గురించి తెలియజేసింది. సినిమా నిడివి సమయం చాలా ఎక్కువైంది. ఏ సన్నీ వేషాలను తీసెయ్యాలనే ఆలోచనతో చిత్ర యూనిట్ చివరికి తన పాత్రలను కట్ చేసిందని తెలిపింది. 

నా వరకు ఆ పాత్రకు 100% న్యాయం చేశాను. కొన్ని డైలాగులు బాగా నచ్చాయి. అలాంటి మంచి సీన్స్ ని కూడా కట్ చేసారని అమ్మడు కొంచెం కష్టంగానే చెప్పేసింది. దీంతో ఇప్పుడు సోనమ్ కామెంట్స్ బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. అయితే హీరోయిన్స్ సీన్స్ ని కత్తిరించడం బాలీవుడ్ లో కొత్తేమి కాదు. ఐశ్వర్య రాయ్ సినిమాలకే తప్పలేదు అని సోషల్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.

PREV
click me!

Recommended Stories

Dhurandhar vs Avatar 3: అవతార్ 3కి చుక్కలు చూపించిన ధురంధర్.. బాక్సాఫీస్ వద్ద రికార్డ్ కలెక్షన్లు
బాహుబలి కంటే ముందు రమ్యకృష్ణ కెరీర్ లో ఐకానిక్ మూవీ.. 25 ఏళ్ళ తర్వాత తొలిసారి థియేటర్ లో చూస్తూ, వైరల్