
టాలీవుడ్ సెలబ్రిటీ కపుల్ నాగ చైతన్య, శోభిత ధూళిపాలకి సంబంధిన రూమర్స్ మరోసారి వైరల్ అయ్యాయి. పెళ్ళైన ఐదు నెలలకి గర్భధారణకు సంబంధించిన ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఇటీవల ముంబైలో జరిగిన WAVES 2025 ఈవెంట్‌లో శోభిత ధూళిపాల వదులుగా ఉండే చీర కట్టులో కనిపించడం తో ఈ రూమర్స్ మొదలయ్యాయి. ఆమె ఇటీవల ధరిస్తున్న వస్త్ర శైలిని గమనించిన కొంతమంది, ఆమె గర్భవతిగా ఉండొచ్చని ఊహించుకుంటున్నారు.
అయితే, ఈ విషయంపై సన్నిహిత వర్గాలు స్పందించాయి. ఓ మీడియా సంస్థతో చైతు, శోభిత సన్నిహితులు ఇలా స్పందించారట. "ఆమె మేటర్నిటీ డ్రెస్సు కాదు, యాంటీ-ఫిట్ డ్రెస్సు వేసుకుంది. కేవలం వస్త్ర ధారణ వల్ల ఇలాంటి రూమర్స్ రావడం ఆశ్చర్యంగా ఉంది." అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలతో గాసిప్ లలో వాస్తవం లేదని తేలింది.
నాగ చైతన్య – శోభిత జంట తమ గతంలో తమ ప్రేమని రహస్యంగా ఉంచారు. ఇన్‌స్టాగ్రామ్‌లో మొదలైన ఒక సాధారణ ఇంటరాక్షన్‌తో ఈ ఇద్దరి మధ్య సంభాషనలు మొదలయ్యాయి. వీరిద్దరికీ తెలుగు భాషపై ఉన్న ప్రేమ, ఉమ్మడి అభిరుచులు మరింత దగ్గర చేశాయి. అనంతరం వారు 2024 ఆగస్టు 8న హైదరాబాద్ లో నిశ్చితార్థం చేసుకుని, 2024 డిసెంబర్ 4న అన్నపూర్ణ స్టూడియోస్, హైదరాబాద్‌లో సన్నిహిత బంధువులు, స్నేహితుల సమక్షంలో తెలుగు సంప్రదాయ పద్దతి లో వివాహం చేసుకున్నారు.
ఇటీవలి ఉత్సవాలలో శోభిత ధరించిన వేషధారణపై సోషల్ మీడియాలో స్పందన పెరగడంతో ఈ గాసిప్‌కు పునాది పడింది. కానీ ఆమె సన్నిహితులు చెప్పినట్టుగా, అది కేవలం ఫ్యాషన్ స్టైల్ మాత్రమేనని స్పష్టమవుతోంది.
ఈ నేపథ్యంలో, గర్భధారణ వార్తలు అధికారికంగా ధృవీకరించబడకపోవడం, సన్నిహితులు వాటిని ఖండించడం వల్ల ప్రస్తుతం ఈ ఊహాగానాలు నిరాధారమైనవే అని భావించవచ్చు. కానీ సెలబ్రిటీల జీవితం ఎప్పుడూ సోషల్ మీడియా దృష్టిలో ఉండటంతో, ఇలాంటి వార్తలు మళ్లీ మళ్లీ చర్చకు వస్తూ ఉంటాయి.