యంగ్ హీరో శివకార్తికేయన్ కు కబురు పెట్టిన రజనీకాంత్, నెల్సన్ దిలీప్ మల్టీ స్టారర్ ప్లాన్ చేశాడా..?

Published : Apr 23, 2022, 12:33 PM IST
యంగ్ హీరో శివకార్తికేయన్ కు కబురు పెట్టిన రజనీకాంత్,  నెల్సన్ దిలీప్ మల్టీ స్టారర్ ప్లాన్ చేశాడా..?

సారాంశం

బీస్ట్ ప్లాప్ అవ్వడంతో రజనీకాంత్ తో డైరెక్టర్ నెల్సన్ దిలీప్ సినిమా పై నీలి నీడలు కమ్ముకున్నాయి. అయితే ఈసినిమా కాన్సిల్ అవ్వలేదు అని. త్వరలో స్టార్ట్ అవుతుందంటూ నెల్సన్ వివరణ ఇవ్వాల్సి వచ్చింది. అయితే ఈ సినిమాపై రోజుకో రూమర్ వినిపిస్తుంది. ఇప్పుడు మరో కొత్త పేరు ఈసినిమా  కోసం వినిపిస్తోంది.   

బీస్ట్ ప్లాప్ అవ్వడంతో రజనీకాంత్ తో డైరెక్టర్ నెల్సన్ దిలీప్ సినిమా పై నీలి నీడలు కమ్ముకున్నాయి. అయితే ఈసినిమా కాన్సిల్ అవ్వలేదు అని. త్వరలో స్టార్ట్ అవుతుందంటూ నెల్సన్ వివరణ ఇవ్వాల్సి వచ్చింది. అయితే ఈ సినిమాపై రోజుకో రూమర్ వినిపిస్తుంది. ఇప్పుడు మరో కొత్త పేరు ఈసినిమా  కోసం వినిపిస్తోంది. 

ఒకప్పుడు సూపర్ స్టార్  రజనీకాంత్ సీనియర్ దర్శకులకు మాత్రమే వరుస అవకాశాలిస్తూ వెళ్లారు.ఆతరువాత కాలానుగూనంగా మారుతూ వచ్చిన సూపర్ స్టార్  యంగ్ డైరెక్టర్లకు కూడా  ఛాన్సులు ఇవ్వడం మొదలుపెట్టారు. గెలుగు ఓటములు లెక్క చేయకుండా యువ దర్శకులను ప్రోత్సహించారు. వాళ్లంతా కూడా తనని మరింత కొత్తగా చూపిస్తూ ఉండటంతో, యువ దర్శకులతో కలిసి పనిచేయడానికే ఆయన ఎక్కువ ఉత్సాహాన్ని చూపుతున్నారు. 

ఈ నేపథ్యంలోనే నెల్సన్ దిలీప్ కుమార్ కి ఆయన అవకాశం ఇచ్చారు. ఈ ఇద్దరి కాంబినేషన్లో ఒక సినిమా రూపొందుతోంది. రజనీకి 169వ సినిమా తెరకెక్కుతున్న ఈమూవీని .. సన్ పిక్చర్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. బీస్ట్ సినిమా వల్ల ఫెయిల్యూర్ ఫేస్ చేసినా.. నెల్సన్ ను పక్కన పెట్టకుండా.. ఆయన మీద నమ్మకంతో సన్ పిక్చర్స్ వారు ఈ సినిమా చేస్తున్నారు.  

ఇక ఈసినిమా కు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమాలో రజనీ కాంత్తో పాటు మరో  కీలకమైన పాత్రను ఒక యంగ్ హీరో చేస్తే బాగుంటుందని అనుకున్నారట. దాంతో తమిళ యంగ్ స్టార్ హీరో  శివకార్తికేయన్ ను సంప్రదించారట. గతంలో ఆయనకి డాక్టర్ సినిమాతో నెల్సన్ దిలీప్ కుమార్ హిట్ ఇచ్చాడు. 100 కోట్ల క్లబ్ లో చేరిన ఆ సినిమాకి శివకార్తికేయన్ నిర్మాత కూడా. అందువలన రజనీ సినిమాలో చేయడానికి ఆయన అంగీకరించాడని అంటున్నారు.

మరో వైపు రజనీ కాంత్ కూడా శివకార్తికేయన్ నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. అంతే కాదు స్వయంగా ఈ విషయంలో ఆయన యంగ్ హీరోతో మాట్లాడినట్టు తెలుస్తోంది.  ప్రస్తుతం  వరుస సినిమాలతో కెరీర్ లో బిజీగా ఉన్న శివకార్తికేయన్ సూపర్ స్టార్ సినిమాలో నటించే అవకాశం రావడంతో.. అందులోను రజనీ కాంత్ స్వయంగా మాట్లాడటంతో వెంటనే ఒప్పేసుకున్నట్టు సమాచారం.ఇందులో నిజమెంత ఉందో తెలియాలంటే అఫీషియల్ అనౌన్స్ మెంట్ వరకూ ఆగాల్సిందే. 
 

PREV
click me!

Recommended Stories

Sreemukhi Remuneration: శ్రీముఖి ఒక్క షోకి ఎంత రెమ్యునరేషన్‌ తీసుకుంటుందో తెలుసా? బుల్లితెర క్వీన్ అనేది ఇందుకే
Arya Underwater Stunt: హాలీవుడ్ రేంజ్ రిస్క్.. గడ్డకట్టే నీళ్ళల్లో 90 నిమిషాలు ఫైట్, సినిమా కోసం హీరో సాహసం