మమ్మల్ని చిత్రహింసలు పెట్టింది.. కోడలిపై శివశంకర్ మాస్టర్ ఆరోపణలు!

Published : May 13, 2019, 04:47 PM IST
మమ్మల్ని చిత్రహింసలు పెట్టింది.. కోడలిపై శివశంకర్ మాస్టర్ ఆరోపణలు!

సారాంశం

డాన్స్ మాస్టర్ గా ఎన్నో సినిమాలకు పని చేసిన శివ శంకర్ మాస్టర్ కొన్ని సినిమాలలో నటించారు కూడా.. 

డాన్స్ మాస్టర్ గా ఎన్నో సినిమాలకు పని చేసిన శివ శంకర్ మాస్టర్ కొన్ని సినిమాలలో నటించారు కూడా.. ఎన్నో ఏళ్లుగా ఆయన తన కెరీర్ లో కొనసాగిస్తూ వస్తున్నారు. అయితే మూడేళ్ల క్రితం శివ శంకర్ మాస్టర్ తన కోడలి కారణంగా కొన్ని ఆరోపణలను ఎదుర్కోవాల్సి వచ్చింది. 

శివ శంకర్ మాస్టర్ పెద్ద కోడలు ఇంట్లో వాళ్లు మానసికంగా వేధిస్తున్నారని కోర్టుని ఆశ్రయించింది. ఆ సమయంలో శివ శంకర్ మాస్టర్ కుటుంబం ఎన్నో ఆరోపణలను ఎదుర్కొన్నారు. ఇప్పటికీ ఈ వివాదం పూర్తిగా సద్దుమణగలేదు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శివ శంకర్ మాస్టర్ తన కోడలితో గొడవపై స్పందించాడు.

ఆమె కారణంగా ఎంతో మానసిక వేదనకి గురైనట్లు చెప్పారు. ఆమెను ఏ రకంగాను ఇబ్బంది పెట్టలేదని, మా కోడలే మమ్మల్ని నానా హింసలకు గురి చేసిందని అన్నారు. డబ్బు  కోసమే ఆమె వచ్చిందని.. ఆ పరమేశ్వరుడే అంతా చూసుకుంటాడని అన్నారు.

ఒక రకంగా ఆమెను తన గురువుగా భావిస్తున్నట్లు చెప్పారు. డాన్స్ తప్ప మరేమీ తెలియని తనకు కోర్టు ఎలా ఉంటుందో..? దానికి సంబంధించిన పనులను నేర్పించిందని అన్నారు. ఆమె కారణంగా ఒక సమస్య ఎదురైతే ఎలా ఎదుర్కోవాలో.. నేర్చుకున్నానని అన్నారు. 
 

PREV
click me!

Recommended Stories

Rashmika Mandanna: రష్మిక టాటూ సీక్రేట్, విజయ్ దేవరకొండ కోసమా? లేక ఆ అవమానానికి కౌంటర్ వేసిందా?
Karuppu Collections: 200 కోట్లకు చేరువలో సూర్య వీరభద్రుడు, 5వ రోజు కరుప్పు కలెక్షన్లు ఎంత?