దాసరి దగ్గర రూ.3 లక్షలు లేక.. పోసాని షాకింగ్ కామెంట్స్!

Published : May 13, 2019, 04:17 PM IST
దాసరి దగ్గర రూ.3 లక్షలు లేక.. పోసాని షాకింగ్ కామెంట్స్!

సారాంశం

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో దాసరి అధ్యాయం గురించి తెలిసిందే. ఎంతోమంది హీరోలను, దర్శకనిర్మాతలను ఇండస్ట్రీకి పరిచయం చేసిన ఘనత ఆయన సొంతం. 

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో దాసరి అధ్యాయం గురించి తెలిసిందే. ఎంతోమంది హీరోలను, దర్శకనిర్మాతలను ఇండస్ట్రీకి పరిచయం చేసిన ఘనత ఆయన సొంతం. అటువంటి వ్యక్తి హాస్పిటల్ లో ఉన్నప్పుడు ఎవరూ పట్టించుకోలేదని నటుడు పోసాని చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న పోసాని మాట్లాడుతూ.. ''ఒకానొక సమయంలో దాసరి నారాయణరావు గారు బైపాస్ సర్జరీ చేయించుకోవాల్సి వచ్చింది. దానికి అవసరమైన మూడు లక్షలు ఆయన దగ్గర లేకపోవడంతో 'మహావీర్' హాస్పిటల్ లో యాభై వేల రూపాయలతో ఆపరేషన్ చేయించుకున్నారు. కనిపిస్తే ఆయన ఎక్కడ డబ్బులు అడుగుతారోనని పదిమంది కూడా ఆయనను చూడడానికి హాస్పిటల్ కి వెళ్లలేదు'' అంటూ చెప్పుకొచ్చారు.

ఎంతోమందికి ఆయన సాయపడ్డారని, మరెంతో మందిని నిలబెట్టారని.. అలాంటి వ్యక్తి పరిస్థితి గురించి జర్నలిస్ట్ మిత్రుడి ద్వారా తెలుసుకొని ఆయన క్షేమాన్ని కోరుతూ లక్ష రూపాయలు ఖర్చు చేసి దినపత్రికలో యాడ్స్ ఇచ్చినట్లు గుర్తు చేసుకున్నారు పోసాని.

అది చూసిన దాసరి గారు కన్నీళ్లు పెట్టుకున్నట్లు చెప్పారు. ఆయన కబురు చేస్తే కలుద్దామని వెళ్లిన పోసాని ఇనుప రేకు మంచంపై ఆయనను చూసి బాధపడినట్లు చెప్పుకొచ్చారు. దిండు కింద ఓ పాతిక వేలు పెట్టేసి వచ్చానని, పేపర్ లో ఇచ్చిన యాడ్స్ చూసి ఇండస్ట్రీలో కొందరు స్పందించారని పోసాని వెల్లడించారు.  

PREV
click me!

Recommended Stories

Dhurandhar vs Avatar 3: అవతార్ 3కి చుక్కలు చూపించిన ధురంధర్.. బాక్సాఫీస్ వద్ద రికార్డ్ కలెక్షన్లు
బాహుబలి కంటే ముందు రమ్యకృష్ణ కెరీర్ లో ఐకానిక్ మూవీ.. 25 ఏళ్ళ తర్వాత తొలిసారి థియేటర్ లో చూస్తూ, వైరల్