
జాతి రత్నాలు ఫేమ్ అనుదీప్ కెవి దర్శకత్వంలో శివకార్తికేయన్ హీరోగా నటించిన తెలుగు-తమిళ ద్విభాషా మూవీ ప్రిన్స్. షూటింగ్ తో సహా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా అక్టోబర్ 21న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా తెలుగు థియేట్రికల్ ట్రైలర్‌ను యూత్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ ఈరోజు లాంచ్ చేశారు.
లుగు, తమిళ్ భాషలలో ఏకకాలంలో తెరకెక్కుతున్న కంప్లీట్ ఎంటర్‌టైనర్ 'ప్రిన్స్'. శివకార్తికేయన్ సరసన మారియా హీరోయిన్ గా నటిస్తోన్న ఈ చిత్రం ఇండియాలోని పాండిచ్చేరి, లండన్ నేపథ్యంలో రూపొందుతోంది. దసరారోజున అందరికీ ఆయుధ పూజ శుభాకాంక్షలు చెబుతూ నిర్మాతలు ప్రిన్స్ విడుదల తేదిని ప్రకటించారు. అక్టోబర్ 21న ప్రిన్స్ ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్ గా విడుదల కానుందని ప్రకటించారు. ఈ నేపధ్యంలో ఈ చిత్రం ట్రైలర్ రిలీజ్ కు రెడీ అయ్యింది. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో విపరీతంగా అంచనాలు నెలకొన్నాయి.
లండన్, పాండిచ్చేరి బ్యాక్‌డ్రాప్‌లలో డిఫరెంట్ స్టోరీతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. తమిళంతో పాటు తెలుగులో ఏకకాలంలో ప్రిన్స్ సినిమా రూపొందుతోంది. శివకార్తికేయన్ నటిస్తున్న తొలి ద్విభాషా సినిమా ఇది. ఇందులో శివకార్తికేయన్‌కు జోడీగా మారియా ర్యాబోషపాకా హీరోయిన్‌గా నటిస్తోంది. ఉక్రెయిన్‌కు చెందిన మారియా హిందీలో స్పెషల్ ఓప్స్ అనే సిరీస్ చేసింది. ప్రిన్స్ సినిమాతో దక్షిణాదిలో హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వబోతున్నది.
తమన్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నాడు. కాగా ఈ ఏడాది శివకార్తికేయన్ హీరోగా నటించిన డాన్ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. వంద కోట్లకుపైగా వసూళ్లను రాబ్టటింది. డాన్ సక్సెస్ తర్వాత శివకార్తికేయన్ హీరోగా నటిస్తున్న ప్రిన్స్‌పై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి.
ఈ చిత్రం మ్యూజికల్ ప్రమోషన్‌లు భాగంగా ఇప్పటికే విడుదలైన ఫస్ట్ సింగల్ ''బింబిలిక్కి పిలాపి'' , డి జెస్సికా' పాటలు చార్ట్ బస్టర్ గా నిలిచి సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. నారాయణ్ దాస్ నారంగ్ ఆశీస్సులతో సునీల్ నారంగ్, డి.సురేష్ బాబు, పుస్కుర్ రామ్ మోహన్ రావు సంయుక్తంగా శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి, సురేష్ ప్రొడక్షన్స్, శాంతి టాకీస్ బ్యానర్లపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సోనాలి నారంగ్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఈ చిత్రానికి మనోజ్ పరమహంస సినిమాటోగ్రాఫర్ గా, ప్రవీణ్ కెఎల్ ఎడిటర్ గా పని చేస్తున్నారు. అరుణ్ విశ్వ సహ నిర్మాత.