సూర్యపై ఇనయ క్రష్‌.. సీక్రెట్ బయటపెట్టిన ఫైమా.. చంటి ఎలిమినేటెడ్‌.. సభ్యులపై హాట్ కామెంట్

Published : Oct 09, 2022, 11:14 PM IST
సూర్యపై ఇనయ క్రష్‌.. సీక్రెట్ బయటపెట్టిన ఫైమా.. చంటి ఎలిమినేటెడ్‌.. సభ్యులపై హాట్ కామెంట్

సారాంశం

ఐదో వారంలో `జబర్దస్త్` కమెడియన్ చలాకీ చంటి ఎలిమినేట్‌ అయ్యారు. ముందుగా ఊహించినట్టే ఆయన ఎలిమినేషన్‌ జరిగింది. అయితే ఆ ఎలిమినేషన్‌ మాత్రం చాలా ఉత్కంఠంగా సాగింది.

బిగ్‌ బాస్‌ తెలుగు 6 ఐదో వారం పూర్తయ్యింది. ఇప్పుడు ఐదుగురు ఎలిమినేట్‌ అయ్యారు. శని, అభినయశ్రీ, నేహా చౌదరి, ఆరోహి ఇప్పటి వరకు ఎలిమినేట్‌ అయ్యారు. తాజాగా ఐదో వారంలో `జబర్దస్త్` కమెడియన్ చలాకీ చంటి ఎలిమినేట్‌ అయ్యారు. ముందుగా ఊహించినట్టే ఆయన ఎలిమినేషన్‌ జరిగింది. అయితే ఆ ఎలిమినేషన్‌ మాత్రం చాలా ఉత్కంఠంగా సాగింది. చివరగా నామినేషన్‌లో ఇనయ, చంటి ఉండగా ఇద్దరిలో ఎవరు ఎలిమినేట్‌ అవుతారనేది ఉత్కంఠ నెలకొంది. అంతిమంగా ఊహించినట్టే చంటి ఎలిమినేట్‌ అయ్యారు. 

ఈ సందర్భంగా వెళ్తూ వెళ్తూ చంటి ఇంటి సభ్యులపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు. అయితే హోస్ట్ నాగార్జున రిపోర్ట్ కార్డ్ రూపంలో ఇంటిసభ్యులకు మార్కులు వేయాలని చెప్పగా, అర్జున్‌, సుదీప, రోహిత్, రాజ్‌, కీర్తిలకు ఫెయిల్‌ మార్కులు(34 అండ్‌ ఆఫ్‌) వేశాడు. అర్జున్‌ తప్పులను చెప్పాడు. ఆయన గేమ్‌ ఆడుతున్నాడు, కానీ ఎక్కడో రాజీపడుతున్నాడు, అది తగ్గించి గేమ్‌పై ఫోకస్‌ పెట్టాలన్నారు. 

సుదీపకి కిచెన్‌లోనే టైమ్‌ సరిపోతుందని, గేమ్‌లకు టైమ్‌ ఉండటం లేదని, కిచెన్‌ నుంచి బయటకు రావాలని తెలిపారు. రోహిత్.. తనలాగే ఉన్నాడని, తాను చేసిన తప్పు చేయోద్దన్నారు. రాజ్‌ అందరిని నమ్ముతాడని, తాను అనుకున్న సరిగా ఎక్స్ ప్రెస్‌ చేయలేకపోతున్నాడని చెప్పాడు. దాన్ని అధిగమించాలని చెప్పాడు. కీర్తికి తన గతాన్ని తీసి గేమ్‌ ఆడాలని చెప్పాడు. 

ఇక సూర్య, శ్రీహాన్‌, ఫైమా, మరీనా, రేవంత్‌లకు టాప్‌ మార్కులిచ్చాడు చంటి. సూర్య ఎక్కువగా ప్రేమిస్తుంటాడని, అది మానేసి ఆట ఆడాలన్నారు. శ్రీహాన్‌ చాలా క్లారిటీ ఉన్న కంటెస్టెంట్‌ అని, ఫైమా అందరిని నవ్విస్తుందని చెప్పాడు. మరీనా మదర్ ఇండియా అని, ఆమె ప్రాబ్లెమ్‌ రోహిత్‌ అని తెలిపాడు. రేవంత్‌ కోపం, ఆవేశం, గారాబం ఎక్కువ అని తెలిపారు. ఇక మిగితా వారిలో ఇనయకి ఆయన వంద మార్కులు వేయడం విశేషం. ఆదిరెడ్డి, గీతూలకు 90మార్కులిచ్చాడు. గీతూ, రేవంత్‌, కీర్తిలకు సలహాలిస్తూ, బాలాదిత్యపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆయన మంచితనం మేకప్‌ అని చెప్పడం గమనార్హం. 

ఇక అంతకు ముందు షోకి సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌ గెస్ట్ గా వచ్చాడు. ఆయన పాటతోనే నాగ్‌ ఎంట్రీ ఇవ్వడం విశేషం. దేవిశ్రీ ప్రసాద్‌ రూపొందించిన పాన్‌ ఇండియా పాప్‌ సాంగ్ ని బిగ్‌ బాస్‌ షోలో ఆవిష్కరించారు. అనంతరం హౌజ్‌మేట్స్ తో చర్చించారు. దేవీ కంపోజ్‌ చేసిన పాటలతో గేమ్‌ ఆడిపించాడు నాగ్‌. చిట్టిలో పాట పేరు ఉంటుంది, దాన్ని బొమ్మల రూపంలో వేస్తే గెస్‌ చేయాల్సి ఉంటుంది. దీనికోసం ఇంటిసభ్యులను రెండు గ్రూపులుగా విడగొట్టి ఆడిపించారు. ఆద్యంతం ఎంటర్‌టైనింగ్‌గా ఈ గేమ్‌ సాగింది. అనంతరం సామెతల గేమ్‌ పెట్టాడు నాగ్. సామెతలు ఎవరికి వర్తిస్తాయో చెప్పాలని చెప్పగా, ఈ గేమ్‌సైతం కాసేపు ఫన్‌ని పంచింది. మొత్తంగా ఐదు వారాలు పూర్తి చేసుకుంది బిగ్‌ బాస్‌ తెలుగు ఆరో సీజన్‌. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

5000 తో ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చింది, ప్రస్తుతం 5 నిమిషాలకు 3 కోట్లు వసూలు చేస్తున్న హీరోయిన్ ఎవరో తెలుసా?
Actor Sivaji: మహిళా కమిషన్‌ దెబ్బకి దిగొచ్చిన శివాజీ.. స్త్రీ అంటే మహాశక్తితో సమానం అంటూ క్షమాపణలు