బింబిసార, సీతా రామం ఓటిటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఒకే రోజు వచ్చేస్తున్నాయి

Published : Aug 27, 2022, 09:59 PM IST
బింబిసార, సీతా రామం ఓటిటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఒకే రోజు వచ్చేస్తున్నాయి

సారాంశం

బింబిసార ఓటిటి హక్కులని జీ5.. సీతారామం హక్కులని అమెజాన్ ప్రైమ్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది.

నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన బింబిసార చిత్రం ఘనవిజయం సాధించింది. ఇప్పటికీ థియేటర్స్ లో విజయవంతంగా రన్ అవుతోంది. జానపద కథా చిత్రంగా వచ్చిన బింబిసార ప్రేక్షకులని విశేషంగా ఆకట్టుకుంది. నందమూరి కళ్యాణ్ రామ్ కింగ్ బింబిసారుడిగా అద్భుతంగా నటించారు. ఈ చిత్రం నందమూరి ఫ్యాన్స్ కి మంచి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. 

బింబిసార విడుదలైన రోజే దుల్కర్ సల్మాన్ సీతారామం చిత్రం కూడా విడుదలై సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. ఎమోషనల్ ప్రేమ కథగా సీతారామం ఆడియన్స్ ని కట్టి పడేసింది. హను రాఘవపూడి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ మధ్య కెమిస్ట్రీ సూపర్బ్ గా కుదిరింది. 

థియేటర్స్ లో అలరించిన ఈ రెండు చిత్రాలు ఓటిటిలోకి వచ్చేందుకు రెడీ అయ్యాయి. బింబిసార ఓటిటి హక్కులని జీ5.. సీతారామం హక్కులని అమెజాన్ ప్రైమ్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఈ రెండు చిత్రాలని సెప్టెంబర్ 9న ఓటిటిలో రిలీజ్ చేయనున్నట్లు బలమైన న్యూస్ వైరల్ గా మారింది. 

వచ్చే వారమే అధికారిక ప్రకటన వెలువడనున్నట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 9కి ఈ రెండు చిత్రాలు 5 వారాల థియేట్రికల్ రన్ కంప్లీట్ చేసుకోనున్నాయి. కాబట్టి ఓటిటి రిలీజ్ కి కూడా అదే సరైన టైం అని మేకర్స్ భావిస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

Bigg Boss telugu 9 బోరుమని ఏడ్చిన రీతూ, బయటకు వెళ్తూ బాంబ్ పేల్చిన కంటెస్టెంట్
ఆలియా భట్ అదిరిపోయే హెయిర్ స్టైల్స్ , ఈ 5 లుక్స్ ట్రై చేశారా ?