నా భార్య చెప్పిందంతా అబద్దం.. గృహ హింస ఆరోపణలపై స్టార్ సింగర్ హనీ సింగ్ వివరణ!

Published : Aug 07, 2021, 02:52 PM IST
నా భార్య చెప్పిందంతా అబద్దం.. గృహ హింస ఆరోపణలపై స్టార్ సింగర్ హనీ సింగ్ వివరణ!

సారాంశం

భార్య షాలిని గృహ హింస ఆరోపణల నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా హనీ సింగ్ స్పందించారు. ఆయన ట్విట్టర్ లో ఓ సుదీర్ఘ సందేశం పోస్ట్ చేశారు.

బాలీవుడ్ స్టార్ సింగర్ యో యో హనీ సింగ్ కుటుంబ వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. భార్య షాలిని తల్వార్ యో యో సింగ్ తో పాటు అతనికి కుటుంబం తనని మానసికంగా శారీరకంగా హింసించారంటూ ఆరోపణలు చేశారు. మరో అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకున్న హనీ సింగ్ ని నిలదీస్తే తనపై దాడి చేశాయని షాలిని తీవ్ర ఆరోపణలు చేశారు. షాలిని ఆరోపణలు దేశవ్యాప్తంగా సంచలనం రేపాయి. 


భార్య షాలిని గృహ హింస ఆరోపణల నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా హనీ సింగ్ స్పందించారు. ఆయన ట్విట్టర్ లో ఓ సుదీర్ఘ సందేశం పోస్ట్ చేశారు.. 'నా భార్య షాలిని తల్వార్‌ నాపై, నా కుటుంబంపై మోపిన అసత్య, హానికరమైన ఆరోపణలు విని నేను చాలా బాధపడ్డాను, ఇప్పటికీ బాధపడుతూనే ఉన్నాను. ఆమె చెప్పేవి చాలా అసహ్యంగా ఉన్నాయి. గతంలో నా మ్యూజిక్‌ మీద, ఆరోగ్యం మీద ఎన్నో రూమర్లు వచ్చినప్పటికీ వాటిపై నేనెప్పుడూ స్పందించలేదు. నాపై వ్యతిరేక ప్రచారం జరిగినా ఎలాంటి ప్రెస్‌నోట్‌ జారీ చేయలేదు. కానీ ఈసారి మౌనంగా ఉండటం కరెక్ట్‌ కాదనిపిస్తోంది. ఎందుకంటే నాకు ఎంతగానో అండగా నిలబడ్డ నా వృద్ధ తల్లిదండ్రులు, చెల్లె మీద ఆమె నీచమైన ఆరోపణలు చేస్తోంది. ఇవి మా పరువుకు భంగం కలిగించేలా ఉన్నాయి.


'నేను ఇండస్ట్రీలో ఉండి 15 ఏళ్లు పైనే అవుతోంది. ఈ జర్నీలో దేశవ్యాప్తంగా ఉన్న పలువురు కళాకారులు, సంగీతకారులతో కలిసి పని చేశాను. నా భార్యతో ఎలా ఉంటాననేది అందరికీ తెలుసు. ఎందుకంటే షూటింగ్‌లు, ఈవెంట్లకు ఆమెను కూడా వెంటపెట్టుకుని వెళ్లేవాడిని. ఆమె చేసిన అసత్య ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నా. నాకు న్యాయవ్యవస్థపై నమ్మకం ఉంది. త్వరలోనే నిజం బయటపడుతుందని ఆశిస్తున్నా. అప్పటివరకు నా గురించి, నా కుటుంబం గురించి ఎలాంటి నిర్ధారణకు రావొద్దని అభిమానులకు విజ్ఞప్తి చేస్తున్నా' అని పోస్ట్‌ పెట్టాడు. ప్రస్తుతం హనీ సింగ్ సోషల్ మీడియా పోస్ట్ వైరల్ గా మారింది. 


 

PREV
click me!

Recommended Stories

Prabhas ఇప్పుడు చేస్తున్నాడు, కానీ 20 ఏళ్ల క్రితమే రజనీకాంత్‌ సంచలనం.. డార్లింగ్‌కి వర్కౌట్‌ అవుతుందా?
Illu Illalu Pillalu Today Episode Dec 31: నర్మదకు అసలు విషయం చెప్పేసిన అమూల్య, ఇక రప్పా రప్పే