Singer Sunitha : ప్రెగ్నెంట్‌ రూమర్లపై స్పందించిన సింగర్‌ సునీత.. మీకు దండం రా నాయనా.. ఏంటీ ఈ రూమర్లు..

Published : Apr 23, 2022, 10:52 PM IST
Singer Sunitha : ప్రెగ్నెంట్‌ రూమర్లపై స్పందించిన సింగర్‌ సునీత.. మీకు దండం రా నాయనా.. ఏంటీ ఈ రూమర్లు..

సారాంశం

సింగర్ సునీత సరదాగా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్డడం నెట్టింట దూమారం రేపింది. దాంతో తను తల్లి కాబోతున్నట్టు ఇంటర్నెట్ లో పుట్టుకొచ్చిన వార్తలను తాజాగా ఖండించింది. రూమర్లు స్ప్రెడ్ చేయొద్దంటూ నెటిజన్లకు సూచించింది.   

సింగర్‌ సునీత (Sunitha) ఏడాది క్రితం పెళ్లి చేసుకుంది. హ్యాపీగా కొత్త జీవితాన్ని గడుపుతోంది. లేటెస్ట్ గా మామిడి తోటలో దిగిన ఫోటోలను పంచుకుంది. జనరల్‌గా సింగర్‌ సునీత ఇటీవల తన ఫామ్‌ హౌజ్‌లో వ్యవసాయ పనులు చేస్తూ, పండ్లు, కూరగాయాలు కోస్తూ కనిపించింది. 
తాజాగా ఆమె చిరునవ్వులు చిందిస్తూ, క్యూట్‌ లుక్‌లో మామిడి కాయలను పట్టుకుని ఫోటోలు దిగింది. వాటిని ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో పంచుకుంది. అయితే పెళ్లైన ఏడాదికే శుభవార్తను చెప్పుతుందనే కోణంతో ఇంటర్నెట్ లో వార్తలు పుట్టుకొచ్చాయి.  అయితే నిజానికి అలాంటిదేమీ లేదని తెలిసింది.

తాజాగా ఈ పుకార్లను ఖండిస్తూ ఫేస్ బుక్ లో మరో పోస్ట్ చేసింది సునీత. ‘నేనేదో సరదాకి పోస్ట్ పెడితే ఇలా క్రేజీ రూమార్లు పుట్టిస్తున్నారు దేవుడా.. నేను ఈరోజు నా మొదటి మామిడి పంటతో ఒక చిత్రాన్ని పోస్ట్ చేశాను. కానీ ఇలాంటి వార్తలు పుట్టుకొస్తాయని అనుకోలేదు. మీకు దండం రా నాయనా.. ఇకపై ఇలా ఊహిస్తూ వదంతులు ప్రచారం చేయడం మానేయండి’ అంటూ ఫేస్ బుక్ లో పోస్ట్ పెట్టింది. దీంతో సునీత ప్రెగ్నెన్సీ నిజం కాదని, వట్టి పుకారేనని తేలిపోయింది.

 
మరోవైపు సునీత ఫ్రీ టైమ్‌లో తన వ్యవసాయ క్షేత్రంలో రిలాక్స్‌ అవుతుంది. సాధ్యమైన చిన్న చిన్న పనులు చేస్తూ, సహజమైన ఆహారం తీసుకుంటూ అందరికీ ఆదర్శంగా నిలుస్తుంది.ఇటీవల బ్యాక్‌ టూ బ్యాక్‌ ఆయా పిక్స్ ని షేర్‌ చేస్తూ తన అభిమానులకు ఖుషీ చేస్తోంది.

PREV
click me!

Recommended Stories

ఆలియా భట్ అదిరిపోయే హెయిర్ స్టైల్స్ , ఈ 5 లుక్స్ ట్రై చేశారా ?
Bigg Boss 9 Remuneration పేదలకు పంచి పెట్టిన ఫైర్ బ్రాండ్ కంటెస్టెంట్, నెటిజన్లు ఏమంటున్నారంటే?