బాలీవుడ్‌లో సంచలనం... కాస్ట్యూమ్ స్టయిలిస్టుపై సింగర్ రాహుల్ జైన్ అత్యాచారం

Published : Aug 16, 2022, 10:59 AM IST
బాలీవుడ్‌లో సంచలనం... కాస్ట్యూమ్ స్టయిలిస్టుపై సింగర్ రాహుల్ జైన్ అత్యాచారం

సారాంశం

బాలీవుడ్ లో కలకలం చోటు చేసుకుంది. అత్యాచార ఆరోపణతో సింగర్ రాహుల్ జైన్ పై కేసు నమోదు అవ్వడం సంచలనంగా మారింది. ఇంతకీ ఏం జరిగింది..? ఈ ఆరోపణలు చేసింది ఎవరు..?

ప్రముఖ బాలీవుడ్ సింగర్ రాహుల్ జైన్ పై ముంబయ్ లో అత్యాచారం కేసు నమోదు అవ్వడం సంచలంగా మారింది. .బాలీవుడ్ గాయకుడు, మ్యూజిక్ కంపోజర్ రాహుల్ జైన్ ముంబయి సిటీలోని తన ఫ్లాట్ లో 30 ఏళ్ల కాస్ట్యూమ్ స్టయిలిస్ట్ పై అత్యాచారం చేశాడని ముంబయి పోలీసులు కేసు నమోదు చేశారు. కాస్ట్యూమ్ డిజైనర్ ను తన ప్లాట్ కు పిలిపించుకుని బలాత్కారం చేశాడన్న ఆరోపణతో అతనికి నోటీసు ఇచ్చారు పోలీసులు. దీని పై బాధితురాలి స్టేట్ మెంట్ కూడా తీసుకున్నారు. 

బాధితురాలి కథనం ప్రకారం.. రాహుల్ జైన్ తనను ఇన్ స్టాగ్రామ్ తాను చేస్తున్న పనిని చూసి బాగుందని మెచ్చుకున్నాడని.. అంతే కాదు...ఒకసారి తన ఫ్లాటుకు రమ్మని ఆహ్వానించాడని బాధిత కాస్ట్యూమ్ స్టయిలిస్టు ఒషివర పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.  ప్లాట్ కు రమ్మని పిలిచి... తనకు మంచి లైఫ్ ఇస్తానని, తనకు  పర్సనల్ కాస్ట్యూమ్ స్టయిలిస్టుగా తన దగ్గరే జాబ్ ఇప్పిస్తానని చెప్పాడంటుంది ఆమె. అంతే కాదు చెప్పి అంధేరీలోని అతని ఫ్లాటుకు పిలిపించి తనను బెడ్రూంలోకి తీసుకువెళ్లి తనపై అత్యాచారం చేశాడని మహిళ ఫిర్యాదు చేశారు.

అంతే కాదు తాను ప్రతిఘటించి, అతని నుంచి విడిపించుకోవడానికి ప్రయత్నించాని..కాని  తనపై రాహుల్ జైన్ బలవంతంగా అత్యాచారం చేశాడన్నరు. అంతే కాదు ఎటువంటి సాక్ష్యాలు మిగలకుండా..వాటినితానే స్వయంగా తొలగించాడని బాధిత మహిళ ఆరోపించారు. బాధితురాలి ఫిర్యాదులో రాహుల్ జైన్ పై పోలీసులు ఐపీసీ సెక్సన్ 376.323,506 ల కింద కేసు నమోదు చేశారు. 

అయితే ఈ విషయంలో సింగర్ రాహుల్ మాత్రం డిఫరెంట్ గా స్పందించారు. అసలు  తనకు ఆ మహిళ ఎవరో తెలియదన్నారు. తన కెరీర్ ను నాశనం చేయడానికే ఎవరో ఇలా చేస్తున్నారన్నారు. ఇంతకు ముందు కూడా.. గతంలోనూ మరో మహిళ  తనపై అత్యాచారం కేసు పెట్టిందని రాహుల్ చెప్పారు. నిరాధార ఆరోపణలతో తనను ఇబ్బందులకు గురి చేయాలనిచూస్తున్నట్టు తెలిపారు. గత ఏడాది అక్టోబరలో ఓ మహిళ తనపై రాహుల్ జైన్ అత్యాచారం చేసి గర్భవతిని చేసి, బలవంతంగా అబార్షన్ చేయించాడని పోలీసులను ఆశ్రయించింది.  ఈకేసు తేలకముందే.. ఇప్పుడు మరో రేప్ కేస్ అతనిపై పడింది. ఇక తాజా  బాధిత మహిళ ఫ్రీలాన్స్ కాస్ట్యూమ్ స్టయిలిస్టుగా పనిచేస్తుందని ముంబయి పోలీసులు చెప్పారు. విచారణ జరుగుతుందన్నారు. 

PREV
click me!

Recommended Stories

మడత మంచం పై పడుకొని, ప్రకృతిని ఆస్వాదిస్తున్న అనసూయ
Bigg Boss Top 5: బిగ్‌ బాస్‌ తెలుగు 9 టాప్‌ 5 కంటెస్టెంట్లు వీరే.. ఒక్క లీక్‌తో లెక్కలన్నీ తారుమారు