లెజెండరీ సింగర్ పి. సుశీలకు అరుదైన గౌరవం!

By team teluguFirst Published Mar 6, 2021, 4:51 PM IST
Highlights

బ్రిటన్ గవర్నమెంట్ మహిళకు అందించే యూకే విమెన్ నెట్వర్క్(యూకేడబ్ల్యూఎన్) అవార్డుకు పి సుశీల ఎంపిక కావడం జరిగింది. ప్రతి ఏడాది విమెన్స్ డే కానుకగా వివిధ రంగాలలో ఉన్నత శిఖరాలకు చేరిన మహిళలకు ఈ అవార్డు బ్రిటన్ ప్రభుత్వం అందిస్తుంది. గతంలో కేవలం బ్రిటన్ మహిళలకు మాత్రమే ఈ అవార్డు అందించేవారు. 

లివింగ్ లెజెండ్ సింగర్ పి. సుశీల మరో అరుదైన గౌరవాన్ని అందుకున్నారు. బ్రిటన్ గవర్నమెంట్ మహిళకు అందించే యూకే విమెన్ నెట్వర్క్(యూకేడబ్ల్యూఎన్) అవార్డుకు ఆమె ఎంపిక కావడం జరిగింది. ప్రతి ఏడాది విమెన్స్ డే కానుకగా వివిధ రంగాలలో ఉన్నత శిఖరాలకు చేరిన మహిళలకు ఈ అవార్డు బ్రిటన్ ప్రభుత్వం అందిస్తుంది. గతంలో కేవలం బ్రిటన్ మహిళలకు మాత్రమే ఈ అవార్డు అందించేవారు. 


ఈసారి అమెరికా, జపాన్, జర్మనీ, ఇండియా వంటి పలు దేశాలకు చెందిన మహిళలను ఎంపిక చేశారు. భారత్ నుండి మొత్తం ఆరుగురు మహిళలు ఎంపిక కాగా, వారిలో సుశీల ఒకరు. సుశీలతో పాటు ఎం వనిత, ఏ ఆర్ రెహానా, మధుమిత, సెల్వ కుమారి నటరాజన్, మాయా రాఘవన్ మరియు ప్రసన్న యడయిల్లియంలు ఎంపికయ్యారు.  దాదాపు ఆరు దశాబ్దాలు సింగర్ గా చిత్ర పరిశ్రమకు సేవలు అందించారు సుశీల. 

దేశంలోని అన్ని ప్రముఖ భాషల్లో వేల కొలది పాటలు సుశీల పాడారు. 1969లో మొదటి జాతీయ అవార్డు గెలుచుకున్న సుశీల.. ఆ అర్హత సాధించిన మొట్టమొదటి ఫీమేల్ సింగర్ కావడం విశేషం. అనేక స్టేట్ అవార్డ్స్ తో పాటు పద్మభూషణ్ అవార్డును ఆమె పొందారు.  
 

click me!