వివాదం: వెనక్కి తగ్గిన మంగ్లీ.. కొత్త పదాలతో బోనాలు సాంగ్!

By team teluguFirst Published Jul 21, 2021, 12:44 PM IST
Highlights

 సర్వత్రా విమర్శల నేపథ్యంలో 'చెట్టు క్రింద కూర్చున్నవమ్మా చుట్టం లెక్క ఓ మైసమ్మా..' సాంగ్ లిరిక్స్ మార్చివేశారు మంగ్లీ. కొత్త పదాలతో మరో సాంగ్ యూట్యూబ్ లో విడుదల చేశారు.

ప్రతి ఏడాది బోనాల వేళ ఓ భక్తి పాటతో స్పెషల్ వీడియో విడుదల చేస్తారు సింగర్ మంగ్లీ. ఈ ఏడాది కూడా అమ్మవారి కోసం ఓ బోనాలు సాంగ్ విడుదల చేశారు. అయితే ఈ సాంగ్ లోని లిరిక్స్ ని హిందూ సంఘాలు, బీజేపీ నేతలు తప్పుబట్టారు. తెలంగాణా సంస్కృతిలో భాగమైన బోనాలు వేడుకలలో అమ్మవారిని విమర్శిస్తూ, అక్కరకు రాని చుట్టాలతో పోల్చడమేమిటని మంగ్లీని తప్పుబడుతున్నారు. గతంలో కూడా హిందూ దేవుళ్లను తిడుతూ మంగ్లీ పాటలు ఉన్నాయని, ఈ సారి గ్రామ దేవతలపై పడిందంటూ కిరణ్మై అనే అమ్మాయి సోషల్ మీడియాలో ఓ వీడియో విడుదల చేయగా, అది వైరల్ అయ్యింది. 


అలాగే బీజీపీ కార్పొరేటర్స్ రాచ కొండ పోలీస్ స్టేషన్ లో మంగ్లీ పాటపై ఫిర్యాదు చేశారు. దేవతను దూషిస్తున్నట్లు అభ్యంతరకరంగా ఉన్న ఆ పాటలోని లిరిక్స్ మార్చి వేయాలని, పాత సాంగ్ సోషల్ మీడియా మాధ్యమాల నుండి తొలగించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సర్వత్రా విమర్శల నేపథ్యంలో 'చెట్టు క్రింద కూర్చున్నవమ్మా చుట్టం లెక్క ఓ మైసమ్మా..' సాంగ్ లిరిక్స్ మార్చివేశారు మంగ్లీ. కొత్త పదాలతో మరో సాంగ్ యూట్యూబ్ లో విడుదల చేశారు. 


చుట్టం అనే మాటతో పాటు, అభ్యంతరకర పదాలు తొలగించి, కొత్త సాంగ్ మంగ్లీ తన యూట్యూబ్ ఛానల్ ద్వారా విడుదల చేశారు. మరి ఇప్పటికైనా ఈ వివాదం ముగుస్తుందో.. లేక ఇంకా ముందుకు వెళుతుందో చూడాలి. హిందూ దేవతల ప్రధాన పండుగులను ఉద్దేశిస్తూ మంగ్లీ పాటలు విడుదల చేస్తూ ఉంటారు. మంగ్లీ భక్తి పాటలకు తెలుగు రాష్ట్రాలలో మంచి డిమాండ్ ఉంది. మొదటిసారి మంగ్లీ బోనాల పాట వివాదాస్పదం అయ్యింది. 

click me!