నా  ఫోటోలు, అశ్లీల వీడియోలు రాజ్ కుంద్రా యాప్ లో ఉంచారు.. పూనమ్ పాండే సంచలన ఆరోపణలు

Published : Jul 21, 2021, 11:20 AM ISTUpdated : Jul 21, 2021, 11:26 AM IST
నా  ఫోటోలు, అశ్లీల వీడియోలు రాజ్ కుంద్రా యాప్ లో ఉంచారు.. పూనమ్ పాండే సంచలన ఆరోపణలు

సారాంశం

రాజ్ కుంద్రా అరెస్ట్ పై విచారం వ్యక్తం చేసిన పూనమ్, కుటుంబ సభ్యుల బాధలను అర్థం చేసుకోగలను అన్నారు. అదే సమయంలో రాజ్ కుంద్రా వలన తనకు జరిగిన నష్టాన్ని, ఇబ్బందిని తెలియజేశారు. 

వివాదాస్పద బోల్డ్ బ్యూటీ పూనమ్ పాండే బిజినెస్ మాన్ రాజ్ కుంద్రా అరెస్ట్ పై స్పందించారు. రాజ్ కుంద్రా అరెస్ట్ పై విచారం వ్యక్తం చేసిన పూనమ్, కుటుంబ సభ్యుల బాధలను అర్థం చేసుకోగలను అన్నారు. అదే సమయంలో రాజ్ కుంద్రా వలన తనకు జరిగిన నష్టాన్ని, ఇబ్బందిని తెలియజేశారు. 


2019లో రాజ్ కుంద్రా ఓ యాప్ కి సంబంధించి తనతో ఒప్పందం కుదుర్చుకున్నారు. నా పేరుపై ఓ అడల్ట్ కంటెంట్  యాప్ స్థాపించి నడపాలనేది ఆలోచన. ఈ యాప్ వలన వచ్చే లాభాల షేర్స్ విషయంలో అవకతవకలు ఉన్నాయని భావించి నేను, ఒప్పందం రద్దు చేశాను. అయినప్పటి నా ఫోటోలు, ప్రైవేట్ వీడియోలు ఆ యాప్ లో పోస్ట్ చేశారు. అలాగే నా పర్సనల్ నంబర్ యాప్ లో పొందుపరచడంతో పాటు, కాల్ చేస్తే  నేను మాట్లాడతానని, నగ్నంగా కనిపిస్తానని సమాచారం పెట్టారు. 


దీని వలన నాకు రోజుకు వేలల్లో ఫోన్ లు, మెస్సేజ్ లు వచ్చేవి. ఆ బాధ భరించలేకే కొన్ని రోజులు విదేశాలకు వెళ్ళాను. తిరిగి వచ్చాక కూడా నాకు అదే తరహా వేధింపులు ఎదురయ్యాయి. నేను నంబర్ మార్చి, కొత్త నంబర్ నుండి సౌరభ్ కుష్వాన్ ని ఫోన్ చేసి, ఆ యాప్ నుండి నా ఫోటోలు, వీడియోలు తొలగించాలని కోరాను. అయినా ప్రయోజనం లేకుండా పోయింది. మరలా కొత్త ఫోన్ నంబర్ కు అస్లీల సందేశాలు, కాల్స్, వీడియోలు వచ్చేవి.. అంటూ పూనమ్ తెలియజేశారు. 


కాగా 2019లో రాజ్ కుంద్రా పై పూనమ్ కేసు ఫైల్ చేశారు. అలాగే ముంబై హై కోర్ట్ లో పిటీషన్ వేశారు. దీనికి సంబంధించి కేసు నడుస్తున్నట్లు సమాచారం. పూనమ్ తో గత వివాదం ప్రస్తుతం రాజ్ కుంద్రా పోర్న్ ఫిల్మ్స్ కేసులో ఇరుక్కోవడం చూస్తే, ఆమె ఆరోపణలు నిజమే అని అర్థం అవుతుంది. 

PREV
click me!

Recommended Stories

Kalyan Padala Remuneration: కళ్యాణ్ పడాల పారితోషికం, ప్రైజ్ మనీ ఎంత? విజేతకు అందే కళ్లు చెదిరే బహుమతులు ఏవో తెలుసా?
Sanjjanaa Galrani: తన హీరోయిన్ సంజనకే ఝలక్ ఇచ్చిన శ్రీకాంత్.. ఎలా ఎలిమినేట్ చేశాడో తెలుసా ?