తల్లి కాబోతుందంటూ వార్తలు.. ఘాటుగా స్పందించిన చిన్మయి

Published : Jul 03, 2021, 07:04 PM IST
తల్లి కాబోతుందంటూ వార్తలు.. ఘాటుగా స్పందించిన చిన్మయి

సారాంశం

తల్లికాబోతుందంటూ వార్తలు గుప్పుమన్నాయి. సోషల్‌ మీడియాలో చిన్మయి ప్రెగ్నెంట్‌ అంటూ వార్తలొస్తున్న నేపథ్యంలో తాజాగా ఆమె స్పందించి ఖండించింది.

`మీటూ` ఉద్యమంతో ఒక్కసారిగా పాపులర్‌ అయిన చిన్మయి శ్రీపాద గాయనిగా, డబ్బింగ్‌ ఆర్టిస్టుగా రాణిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఆమె తల్లికాబోతుందంటూ వార్తలు గుప్పుమన్నాయి. సోషల్‌ మీడియాలో చిన్మయి ప్రెగ్నెంట్‌ అంటూ వార్తలొస్తున్న నేపథ్యంలో తాజాగా ఆమె స్పందించి ఖండించింది. నటుడు, దర్శకుడు రాహుల్‌ రవీంద్రన్‌ భార్య అయిన చిన్మయి తాజాగా ప్రగ్నెంట్‌ రూమర్స్ పై ఘాటుగా స్పందించింది. ఇలాంటి రూమర్స్ పై స్పందించి విసిగిపోయానని తెలిపింది. 

`ఇటీవల మా మరిది వివాహం ఎంతో వేడుకగా జరిగింది. వేడుకకు సంబంధించిన కొన్ని ఫొటోలను నా భర్త రాహుల్‌ ఇన్‌స్టా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ఆ ఫొటోల్లో నన్ను చూసి చాలామంది నేను తల్లికాబోతున్నానని అనుకున్నారు. కొన్ని యూట్యూబ్‌ ఛానెల్స్ అయితే ప్రత్యేకంగా వీడియోలు కూడా సృష్టించేశాయి. అయితే నేను చెప్పేది ఏమిటంటే.. నేను తల్లి కాబోతున్నానంటూ వస్తోన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. నేను గర్భవతిని కాదు. అలాగే, నా వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ప్రైవేట్‌ విషయాలను ఇతరులతో పంచుకోవడం నాకు ఇష్టం లేదు. 

సోషల్‌మీడియా ఖాతాలు ఉన్నప్పటికీ వాటిల్లో ఎక్కడా నా విషయాలు చెప్పను. నిజం చెప్పాలంటే నా బెస్ట్‌ ఫ్రెండ్స్‌ ఎవరో కూడా కొంతమందికి తెలీదు. భవిష్యత్తులో కూడా నా ప్రెగ్నెన్సీ, నాకు పుట్టబోయే పిల్లల గురించి చెప్పాలనిపిస్తే చెప్తా. లేదంటే లేదు. ఎందుకంటే అది మా వ్యక్తిగత విషయం. కాబట్టి ఇప్పటికైనా మీరు నాపై పుకార్లు సృష్టించడం మానేస్తే మంచిది. ఇలాంటి పుకార్ల వల్ల నేను పూర్తిగా అలసిపోయా` అని చిన్మయి పోస్ట్‌ పెట్టారు. ఇక వృత్తిపరమైన జీవితం విషయానికి వస్తే దక్షిణాదిలో స్టార్‌ సింగర్‌గా రాణిస్తున్న చిన్మయి.. సుమారు రెండేళ్ల క్రితం వైరముత్తుపై మీటూ ఆరోపణలు చేశారు. దాంతో ఆమెపై కోలీవుడ్‌ ఇండస్ట్రీలో బ్యాన్ విధించారు. అయినప్పటికీ తన పోరాటాన్ని ఆపడం లేదు చిన్మయి. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Jr Ntr కి రెండో సారి హ్యాండిచ్చిన త్రివిక్రమ్‌.. తారక్‌కే ఎందుకిలా జరుగుతుంది?
తెలుగులో నా ఫేవరెట్ హీరో అతడే.. ఒక్కసారైనా కలిసి నటించాలి.. క్రేజీ హీరోయిన్ కామెంట్స్