94 ఏళ్ల వయసులో సీనియర్ డైరెక్టర్ సాహసం, నాగ్ అశ్విన్ తో కలిసి సింగీతం శ్రీనివాసరావు సినిమా

Published : Jan 31, 2026, 11:09 PM IST
Singeetam Srinivasa Rao Directed

సారాంశం

ఎన్నో అద్భుతమైన సినిమాలు అందించిన సీనియర్ స్టార్ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు.. ఓ సాహసమే చేయబోతున్నారు. 94 ఏళ్ల వయసులో సినిమాను డైరెక్ట్ చేయబోతున్నట్టు ప్రకటించారు.

94 ఏళ్ల వయసులో సాహసం..

సింగీతం శ్రీనివాసరావు, నాగ్ అశ్విన్, దేవి శ్రీ ప్రసాద్, వైజయంతి మూవీస్ కాంబినేషన్ లో  ఓ సినిమాను తెరకెక్కించబోతున్నారు. SSR61 వర్కింక్ టైటిల్ తో రూపొందబోతున్న ఈసినిమాను తాజాగా అనౌన్స్‌చేశారు. రిజినాలిటీకి, వినూత్న ప్రయోగాలకు చిరునామాగా నిలిచిన లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు ఇప్పుడు తన కెరీర్‌లోనే అత్యంత గొప్ప ప్రాజెక్ట్‌తో ముందుకు వస్తున్నారు. నాగ్ అశ్విన్ తెరకెక్కించిన కల్కి 2898 ఏడికి క్రియేటివ్ సహకారం అందించిన తర్వాత, ఇప్పుడు సింగీతం స్వయంగా దర్శకత్వ బాధ్యతలు తీసుకుంటూ SSR61 ని తెరకెక్కిస్తున్నారు.

అనుభవం, ఆధునిక ఆలోచనల కలయిక

ఈ ప్రాజెక్ట్‌ను తాజాగా పూజా కార్యక్రమంతో ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా విడుదల చేసిన అనౌన్స్‌మెంట్ వీడియోలో సింగీతం క్రియేటివిటీ, ఆయన సినిమాలపై ఉన్న ప్రేమ, తరతరాల దర్శకులపై ఆయన ప్రభావాన్ని గుర్తు చేసే క్లిప్స్ ఆకట్టుకున్నాయి. పుష్పక విమానం, ఆదిత్య 369 లాంటి క్లాసిక్స్‌ను మరోసారి గుర్తు చేశాయి. ఈ అద్భుతమైన చిత్రాన్ని వైజయంతి మూవీస్ బ్యానర్‌పై నాగ్ అశ్విన్ నిర్మిస్తున్నారు. అనుభవం, ఆధునిక ఆలోచనలు కలిసి వస్తున్న ఈ కాంబినేషన్‌పై అంచనాలు భారీగా ఉన్నాయి. రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించడం సినిమాకు మరింత ఎనర్జీని తీసుకురానుంది.

 

 

తెలుగు సినిమాకు గర్వకారణం

వైజయంతి మూవీస్ ఈ చిత్రాన్ని సింగీతం గారి కెరీర్‌లోనే గొప్ప ప్రాజెక్ట్ గా అభివర్ణించింది. త్వరలోనే టైటిల్‌తో పాటు మరిన్ని వివరాలు వెల్లడించనున్నారు.ఈ ప్రాజెక్ట్ భారతీయ సినిమాలో ఒక మైలురాయిగా నిలవనుంది. ఇది సింగీతం రీ-ఎంట్రీ మాత్రమే కాకుండా.. ఆయన తననే తాను అధిగమించాలని లక్ష్యంగా పెట్టుకుని చేస్తున్న సినిమా. SSR61 ఈ ఏడాది అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో ఒకటిగా మారింది. 94 ఏళ్ల వయసులో సింగీతం ఈసినిమాను పూర్తి చేసి హిట్టుకొడితే.. తెలుగు సినిమా పరిశ్రమకు అది ఎంతో గర్వకారణం మాత్రమే కాదు.. చరిత్రలో నిలిచిపోయే సినిమా అవుతుంది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

250 కోట్ల బంగ్లాకు రణబీర్, ఆలియా భట్ ఏం పేరు పెట్టారో తెలుసా?
Jabardasth : చలాకి చంటి ని మోసం చేసింది ఎవరు, నాశనమైపోతారని.. జబర్దస్త్ స్టార్ కమెడియన్ శాపనార్ధాలు..