అల్లరి నరేష్, సునీల్ ఇద్దరూ సోలో హీరోలుగా ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా.. ఆడియన్స్ ని మెప్పించలేకపోతున్నారు. దీంతో వీరిద్దరిని హీరోలుగా పెట్టి దర్శకుడు భీమనేని శ్రీనివాస్ 'సిల్లీ ఫెలోస్' అనే సినిమాను రూపొందించారు.
నటీనటులు: సునీల్, అల్లరి నరేష్, చిత్ర శుక్ల, నందిని రాయ్, పూర్ణ, జయప్రకాష్ రెడ్డి తదితరులు
సంగీతం: శ్రీవసంత్
సినిమాటోగ్రఫీ: అనీష్ తరుణ్ కుమార్
ఎడిటింగ్: గౌతమ్ రాజు
నిర్మాతలు: కిరణ్ రెడ్డి, భరత్ చౌదరి
దర్శకత్వం: భీమనేని శ్రీనివాస్
అల్లరి నరేష్, సునీల్ ఇద్దరూ సోలో హీరోలుగా ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా.. ఆడియన్స్ ని మెప్పించలేకపోతున్నారు. దీంతో వీరిద్దరిని హీరోలుగా పెట్టి దర్శకుడు భీమనేని శ్రీనివాస్ 'సిల్లీ ఫెలోస్' అనే సినిమాను రూపొందించారు. ఎప్పటినుండో సక్సెస్ కోసం ఎదురుచూస్తోన్న ఈ ఇద్దరు హీరోలు ఈ సినిమాతో ఎలాంటి సక్సెస్ ని అందుకున్నారో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం!
undefined
కథ:
వీరబాబు(అల్లరి నరేష్), సూరి(సునీల్) వాళ్ల ఊరి ఎమ్మెల్యే జాకెట్(జయప్రకాశ్ రెడ్డి) కి రైట్, లెఫ్ట్. జాకెట్ చేసే పనుల్లో వీరిద్దరి హస్తం ఉంటుంటుంది. ఊరికే చేసే మంచి పనుల్లో భాగంగా సామూహిక వివాహాలు జరిపించడానికి సిద్ధమవుతాడు జాకెట్. వాటిని చెడగొట్టాలని అతడి ప్రత్యర్ధులు ప్లాన్ చేస్తారు. ఈ క్రమంలో ఆల్రెడీ పెళ్లి కుదిరిన సూరి.. పుష్ప(నందిని రాయ్) అనే అమ్మాయి మెడలో తాళి కట్టాల్సి వస్తుంది. ఆ విషయం కాస్త పేపర్లకు ఎక్కడంతో పుష్పతో విడాకులు తీసుకోవాలని ప్రయత్నిస్తుంటాడు సూరి.
మరోపక్క వీరబాబు.. వాసంతి(చిత్ర శుక్ల) అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. ఆమె పోలీస్ కావాలని ప్రయత్నిస్తుంటుంది. దీంతో వాసంతి తల్లి దగ్గర పది లక్షలు తీసుకొని ఎమ్మెల్యే జాకెట్ కి రికమెండేషన్ చేయమని డబ్బులు ఇస్తాడు వీరబాబు. అంతలోనే జాకెట్ ప్రమాదంలో పడతాడు. రూ.500 కోట్లకు సంబంధించిన జాకెట్ కి ఓ నిజం తెలియడంతో ఆ డబ్బుని దక్కించుకోవాలని భూతం(పోసాని కృష్ణమురళి) గ్యాంగ్ ట్రై చేస్తుంటుంది. మరి ఈ సమస్యల నుండి జాకెట్ ని వీరబాబు, సూరి రక్షించగలిగారా..? ఇంతకీ ఆ రూ.500 కోట్ల కథేంటి..? వీరబాబు తన ప్రేమను దక్కించుకున్నాడా..? సూరి కథ సుఖాంతమైందా..? అనే విషయాలు తెరపై చూసి తెలుసుకోవాల్సిందే!
విశ్లేషణ:
రెండేళ్ల క్రితం తమిళంలో వచ్చిన 'వెలయును వండుత్తా వేలైక్కారన్' అనే సినిమాను తెలుగులో 'ప్రేమ లీల పెళ్లి గోల' అనే పేరుతో డబ్బింగ్ చేసి విడుదల చేశారు. అదే సినిమాను 'సిల్లీ ఫెలోస్' అనే పేరుతో రీమేక్ చేసి తెలుగు ప్రేక్షకులకు అందించాడు భీమనేని శ్రీనివాస్. ఆల్రెడీ రెండేళ్ల క్రితం విడుదలైన సినిమాను ఆర్టిస్టులు, డైలాగులకు మర్చి మరోసారి చూపించాడు. ఇదివరకే చూసేసిన సినిమా కావడంతో కనీసం సినిమా మీద ఆసక్తి కలగదు. పోనీ డబ్బింగ్ వెర్షన్ చూడని వారికైనా ఈ సినిమా నచ్చుతుందనుకుంటే పొరపాటే. కెరీర్ పరంగా ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటున్న అల్లరి నరేష్, సునీల్ లు ఏం నచ్చి ఈ కథ ఓకే చేశారనేది అర్ధం కానీ విషయం.
ప్రథమార్ధమంతా సూరి, పుష్పల పెళ్లి ట్రాక్, హీరో హీరోయిన్ల లవ్ ట్రాక్ మీద దృష్టి పెట్టిన దర్శకుడు సెకండాఫ్ కు వచ్చేసరికి కూడా కథను ఒక కొలిక్కి తీసుకురాకుండా అక్కడ కూడా అర్ధం లేని, నవ్వురాని కామెడీ ట్రాక్ లను జోడించి తలపట్టుకునేలా చేశాడు. ముఖ్యంగా సెకండాఫ్ ఎక్కువైన రన్ టైమ్ తో మరీ భారంగా తోచి శుభం కార్డు కోసం ఎదురుచూసేలా చేసింది. ఇక మధ్యలో వచ్చే పాటలైతే వినడం కాదు కదా కనీసం స్క్రీన్ మీద చూడదగిన విధంగా కూడా లేవు. అల్లరి నరేష్, సునీల్ లు తమ నటనతో ఎంతగా నవ్వించాలని ప్రయత్నించినా.. పసలేని కథ, కథనాలతో వారి నటన కూడా తేలిపోయింది.
తెరపై నందిని రాయ్ ని చూడడం కష్టమే.. పూర్ణ ఒకట్రెండు సన్నివేశాలకు పరిమితమైంది. జయప్రకాశ్ రెడ్డి తో చేయించిన కామెడీ కొన్ని చోట్ల నవ్వు తెప్పించినా.. క్లైమాక్స్ లో మాత్రం అతడు చేసే కామెడీకి నవ్వాలో, ఏడ్వాలో అర్ధం కానీ విధంగా ఉంది. దానికి తోడు పోసాని కృష్ణమురళి తన గ్యాంగ్ తో పాటు చేసే కామెడీ రోత పుట్టిస్తుంది. చిత్రశుక్ల ఉన్నంతలో ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. అర్థం లేని కథను, గమ్యం లేని కథనాన్ని తయారుచేసుకుని ఏమాత్రం చూసే విధంగాలేని సినిమాను దర్శకుడు భీమనేని శ్రీనివాస్ ప్రేక్షకుల ముందుంచాడు. సోషల్ మీడియాలో కనిపించే జోక్స్ ని తన సినిమా కోసం వాడుకున్నాడు.
కొన్ని డైలాగులు సిట్యుయేషన్ కి సింక్ కాకుండా చికాకు కలిగిస్తాయి. సినిమాటోగ్రఫీ వర్క్ నాసిరకంగా ఉంది. శ్రీ వసంత్ అందించిన సంగీతం ఏ కోశానా ఆకట్టుకోలేకపోయింది. ముఖ్యంగా పాటల్లో సాహిత్యం గురించి మాట్లాడుకోకపోవడమే మంచిది. 'హెడ్డేకురా' అనే పాట ఆడియన్స్ కి నిజంగా హెడ్డేకు తెప్పిస్తుంది. గౌతమ్ రాజు తన ఎడిటింగ్ ద్వారా సెకండాఫ్ లో చాలా భాగం కత్తిరించి ఉండాల్సింది. నిర్మాణ విలువలు కథకు తగ్గట్లుగా ఉన్నాయి. మొత్తానికి ఎంతో నమ్మకంతో సునీల్, నరేష్ లు కలిసి నటించిన ఈ సినిమా ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేయడంలో పూర్తిగా విఫలమైందనే చెప్పాలి.
రేటింగ్: 1.5/5
ఇది కూడా చదవండి..