మోదీతో ఇంటర్వ్యూ.. అక్షయ్ ఓ విలన్.. హీరో కామెంట్స్!

Published : Apr 25, 2019, 09:58 AM IST
మోదీతో ఇంటర్వ్యూ.. అక్షయ్ ఓ విలన్.. హీరో కామెంట్స్!

సారాంశం

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ప్రధాని మంత్రి నరేంద్ర మోదీని ఇంటర్వ్యూ చేశారు. 

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ప్రధాని మంత్రి నరేంద్ర మోదీని ఇంటర్వ్యూ చేశారు. ఎన్నికల వేళ అక్షయ్ ఇలా మోదీని ఇంటర్వ్యూ చేయడంతో ఎక్కువ హైప్ వచ్చేసింది. అయితే ఈ ఇంటర్వ్యూపై కోలీవుడ్ నటుడు సిద్ధార్థ్ సెటైరికల్ గా ట్వీట్ చేశాడు.

ప్రధానితో ఇంటర్వ్యూ చేసిన అక్షయ్ కుమార్ ని విలన్ గా అభివర్ణిస్తూ వివాదాస్పద ట్వీట్ చేశారు. 'అక్షయ్ కుమార్ ఒక విలన్.. ఆయన్ని తక్కువ అంచనా వేశాం' అంటూ తన ట్వీట్ లో రాసుకొచ్చాడు.

అయితే తన కామెంట్ కి పూర్తి వివరణ ఇవ్వన్నప్పటికీ ప్రభుత్వ తీరుపై తన అసంతృప్తిని ఈ ట్వీట్ ద్వారా తెలియజేశారంటూ మోదీని వ్యతిరేకించే వర్గం సిద్ధార్థ్ కి సపోర్ట్ గా నిలుస్తున్నారు. మరోపక్క దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలు జరుగుతున్న సమయంలో మోదీని రెండోసారి ప్రధాని చేయడానికి అక్షయ్ కుమార్ తనవంతు సాయం చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలుపెట్టారు.

మరికొందరు మోదీ అభిమానులు మోదీ ముందు అక్షయ్ కాలు మీద కాలు వేసుకొని కూర్చొని ఇంటర్వ్యూ చేయడాన్ని  తప్పుబడుతున్నారు. ప్రధానికి మీరిచ్చే గౌరవం ఇదేనా అంటూ  మండిపడుతున్నారు. 
 

PREV
click me!

Recommended Stories

ప్రభాస్, రామ్ చరణ్ తో పాటు.. 2026లో బాక్సాఫీస్ ను షేక్ చేయబోతున్న స్టార్ హీరోల సినిమాలు
Bigg Boss Telugu 9: నిధి అగర్వాల్ కి చుక్కలు చూపించిన ఇమ్మాన్యుయేల్.. హౌస్ లో కూడా ఆమె పరిస్థితి అంతేనా ?