కైరా అద్వానీతో లవ్వా?.. హీరో షాకింగ్ రియాక్షన్

Published : Jul 03, 2019, 10:58 AM IST
కైరా అద్వానీతో లవ్వా?.. హీరో షాకింగ్ రియాక్షన్

సారాంశం

బాలీవుడ్ లో ఇటీవల ఒక రూమర్ డోస్ మరి ఎక్కువైంది. భరత్ అనే నేను సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమైన హాట్ బ్యూటీ కైరా అద్వానీ ప్రేమలో మునిగి తేలుతున్నట్లు టాక్ వచ్చింది

బాలీవుడ్ లో ఇటీవల ఒక రూమర్ డోస్ మరి ఎక్కువైంది. భరత్ అనే నేను సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమైన హాట్ బ్యూటీ కైరా అద్వానీ ప్రేమలో మునిగి తేలుతున్నట్లు టాక్ వచ్చింది. అది కూడా యువ హీరో సిద్దార్థ్ మల్హోత్రా అని చెప్పగానే దేశమంతా హాట్ టాపిక్ అయ్యింది. 

అయితే విషయం మరింత ముదరకముందే యువ హీరో సిద్దార్థ్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. కైరాతో నాకు లవ్వా? అంటూ.. ఎలాంటి డేటింగ్ చేయడం లేదని రూమర్స్ కి చెక్ పెట్టె ప్రయత్నం చేశాడు. రూమర్స్ గురించి వినగానే షాక్ గురయ్యానని చెబుతూ ఆమెతో షేర్ షా అనే సినిమాలో కలిసి నటిస్తున్నట్లు చెప్పాడు. 

తనకు కైరా మంచి ఫ్రెండ్ అని చెప్పిన సిద్దార్థ్ రూమర్స్ ని ఎవరు నమ్మవద్దని స్ట్రాంగ్ గా చెప్పాడు. ఇక ఈ విషయంపై కైరా ఏ విధంగాను స్పందించలేదు. ఇటీవల కబీర్ సింగ్ తో బాక్స్ ఆఫీస్ హిట్ అందుకున్న ఈ బేబీ స్టార్ హీరోలతో అవకాశాలను అందుకోవడానికి సిద్ధమవుతోంది.

PREV
click me!

Recommended Stories

Meenakshi Chaudhary ఫస్ట్ క్రష్‌ ఎవరో తెలుసా? ప్రభాస్‌ కాదు.. వామ్మో మీనాక్షి కోరికలకు మతిపోవాల్సిందే
Rani Mukerji: 47 ఏళ్ళ వయసులో క్రేజీ హీరోయిన్ గా రాణి ముఖర్జీ.. ఆమె కెరీర్ లో టాప్ 5 సినిమాలు ఇవే