'వకీల్ సాబ్': శృతి పాత్ర చిన్నది..పైకం పెద్దది

Surya Prakash   | Asianet News
Published : Nov 26, 2020, 05:28 PM IST
'వకీల్ సాబ్': శృతి పాత్ర చిన్నది..పైకం పెద్దది

సారాంశం

ఒరిజనల్ సినిమాలో ఆమె పాత్ర లేదు. దాని కమర్షియల్ వెర్షన్ గా రూపొందుతున్న వకీల్ సాబ్ లో ఆమె పాత్రను క్రియేట్ చేసారు. ప్లాష్ బ్యాక్ లో ఆ పాత్ర రానుందని సమాచారం. గెస్ట్ రోల్ అయినా సినిమా కీ శృతిహాసన్ పాత్ర చాలా కీలకమని అంటున్నారు. 


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీఎంట్రీ చిత్రం 'వకీల్ సాబ్'.. హిందీలో అమితాబ్ నటించిన ‘పింక్’ చిత్రానికి అఫీషియల్ రీమేక్​ ఈ సినిమా తెరకెక్కుతోంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో పవన్‌పై కొన్ని కీలకమైన సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. తాజా షెడ్యూల్‌లో పవన్‌తో పాటు హీరోయిన్ శృతి హసన్ కూడా సెట్స్ లో చేరనున్నట్లు వార్తలు వచ్చాయి. ఇదే విషయాన్ని శృతి సైతం ఖరారు చేసింది. నిజానికి శృతి షెడ్యూల్ ఇప్పట్లో లేదట. జనవరి నుండి ఈ భామ ‘వకీల్ సాబ్’ షూటింగ్‌లో పాల్గొనుందట. డిసెంబర్‌లో పవన్, శృతిలపై ముఖ్యమైన సన్నివేశాలతో పాటు రొమాంటిక్ సీన్స్ తెరకెక్కిస్తారట. 

ఒరిజనల్ సినిమాలో ఆమె పాత్ర లేదు. దాని కమర్షియల్ వెర్షన్ గా రూపొందుతున్న వకీల్ సాబ్ లో ఆమె పాత్రను క్రియేట్ చేసారు. ప్లాష్ బ్యాక్ లో ఆ పాత్ర రానుందని సమాచారం. గెస్ట్ రోల్ అయినా సినిమా కీ శృతిహాసన్ పాత్ర చాలా కీలకమని అంటున్నారు. తాజాగా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో టచ్‌లోకి వచ్చిన శృతి హాసన్.. `వకీల్ సాబ్` గురించి మాట్లాడింది.పవన్ మళ్లీ సినిమాలు చేస్తుండడం సంతోషంగా ఉంది. ఆయన రీ-ఎంట్రీ సినిమాలో నేను భాగమైనందుకు మరింత ఆనందంగా ఉంది. జనవరి నుంచి 'వకీల్ సాబ్' షూటింగ్‌కు హాజరవుతా. పవన్‌తో మూడోసారి పనిచేస్తున్నాను అంటూ చెప్పుకొచ్చింది. 

ఇక శృతిహాసన్ ది గెస్ట్ రోల్ అయినప్పటికీ...ఆమె రెమ్యునేషన్ మాత్రం తగ్గించలేదట. తన రెగ్యులర్ రెమ్యునేషన్ శృతి హాసన్ తీసుకుందని తెలుస్తోంది.  దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నాడు. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తుండగా.. చిత్రంలో పవన్ సరసన అంజలి, నివేత థామస్, అనన్య నాగేళ్ల హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రకాష్ రాజ్ కీలక పాత్ర పోషిస్తున్నారు.  

PREV
click me!

Recommended Stories

ఓటీటీలో మీకోసం వీకెండ్‌ లో దుమ్మురేపే 5 కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు
Karthika Deepam 2 Today Episode: కాశీని రెచ్చగొట్టిన వైరా- శ్రీధర్ అరెస్ట్- రక్తం కక్కుకున్న సుమిత్ర