శృతీహసన్ పెళ్లికి ముహూర్తం ఫిక్స్

First Published Feb 21, 2018, 9:36 AM IST
Highlights
  • శృతీహసన్ పెళ్లికి ముహూర్తం ఫిక్స్ 

శ్రుతి హాసన్ బాలీవుడ్ లో అడుగుపెట్టాక... అక్కడ అన్నీ వరుస ఫ్లాపులే పలకరించాయి. గబ్బర్ సింగ్ సినిమా తరువాత కొన్నాళ్లు తెలుగులో బాగానే నడిచినా.... కొత్త హీరోయిన్లు రావడంతో అవకాశాలు తగ్గిపోయాయి. తమిళంలో అంత క్రేజ్ లేదు. దీంతో ఏడాదిగా ఆమెకు చెప్పుకోదగ్గ స్థాయిలో సినిమాలు లేవు. దీంతో ఆమె ప్రస్తుతం కెరీర్ పరంగా ఖాళీగా ఉంది. కానీ వ్యక్తిగత జీవితంలో మాత్రం తన బాయ్ ఫ్రెండ్తో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ బిజీగా ఉంది. ఆమె లండన్ కు చెందిన మైఖేల్ కోర్సెల్ తో ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. మైకెల్ లండన్ లో థియేటర్ ఆర్టిస్టు. అతడిని తన తల్లీ తండ్రులకు కూడా పరిచయం చేసింది శ్రుతి. కమల్ హాసన్ కూడా పెళ్లికి ఒప్పుకున్నట్టే సమాచారం. సారిక కూడా కూతురి కోరికను కాదనలేదు. దీంతో వీరి ప్రేమకు గ్రీన్ సిగ్నల్ పడినట్టే.

ఎలాగూ కెరీర్ కుంటుపడింది కనుక... ఈ ఏడాదే పెళ్లి చేసుకోవడానికి సిద్దపడుతోంది శ్రుతి అంటూ ఇప్పుడు అత్యంత సన్నిహితులు చెబుతున్నారు. ఈ ఏడాది డిసెంబర్లో వీరి పెళ్లి జరగనున్నట్టు ఇప్పుడు ఒక బాలీవుడ్ మీడియా ఎక్సుక్లూజివ్ కథనం ప్రచురించింది. దీని గురించి శృతిని అడిగితే మాత్రం.. ఇంకా పెళ్ళికి టైముంది అని చెప్పింది. మరి డిసెంబర్లో పెళ్ళి అంటే ఇంకా 10 నెలల టైమ్ ఉన్నట్లేగా. శ్రుతి ప్రస్తుతం ముంబైలో ఉండగా... మైకెల్ వర్క్ పర్మిట్ వీసాతో ఇండియాకు - లండన్ కు తిరుగుతున్నాడు. 

click me!