
టాలీవుడ్ లో కొన్నేళ్ళ పాటు స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలిగింది శ్రీయ. ఆండ్రీ అనే విదేశీయుడిని పెళ్ళాడిన ఈ బ్యూటీ.. ఒక బిడ్డను కూడా కన్నది. రీసెంట్ గా భర్త ఆండ్రీ హాస్పిటలైజ్ అయినట్టు తెలుస్తోంది.
టాలీవుడ్ లో కొన్నేళ్ల పాటు స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలిగింది శ్రీయా శరణ్. కొన్ని సంవత్సరాల క్రితం ఫారెనర్ ఆండ్రీని పెళ్లి చేసుకుని సడెన్ గా ఫ్యామిలీ లైఫ్ లోకి ఎంటర్ అయ్యింది. ఇటీవలే శ్రియ ఒక బిడ్డకు జన్మనిచ్చింది. చిన్నారికి రాధ అని పేరు పెట్టుకుంది భర్తతో ఎప్పుడూ హ్యాపీగా టూర్లు వేస్తూ.. ఇష్టమైన ప్రదేశాలు చూస్తూ.. అడపాదడపా సినిమాలు కూడ చేస్తోంది శ్రీయ. ఇక రీసెంట్ గా ఓ బాధాకరమైన పోస్టును ఫ్యాన్స్ తో షేర్ చేసింది.
తన భర్త ఆసుపత్రిలో ఉన్న ఫొటోను అభిమానులతో పంచుకుంది శ్రీయ శరణ్. గత కొంత కాలంగా శ్రియ భర్త హెర్నియాతో బాధ పడుతున్నాడట. రీసెంట్ గా హైదరాబాదులోని అపోలో హాస్పిటల్ లో జాయిన్ అయ్యాట ఆండ్రీ. ఆయనకు డాక్టర్స్ ఆపరేషన్ చేసినట్టు శ్రీయా తెలిపింది. ప్రస్తుతం ఆయన పరిస్థితి బాగుందని శ్రియ తెలిపింది. అనారోగ్యంతో ఉన్నప్పుడు రాధను కూడా ఎత్తుకోలేని స్థితిలో తన భర్త ఉండేవాడని, ఇప్పుడు ఆయన బాగున్నాడని చెప్పింది.
దీని కోసం సాయపడిన డాక్టర్స్ కు.. ప్రత్యేకంగా ఉపాసన కొణిదెలకు, డాక్టర్ రజనీశ్ రెడ్డికి ఈ సదర్భంగా శ్రీయ కృతజ్ఞతలు చెపుతున్నానని అన్నారు. తన భర్త ఆసుపత్రిలో ఉన్న ఫొటోలను ఇన్ స్టాలో షేర్ చేసింది శ్రీయా శరణ్. ఈ పోస్ట్‌పై స్పందించిన ఉపాసన అంతా సవ్యంగానే జరిగినందుకు సంతోషంగా ఉందని రిప్లై ఇచ్చింది.
అయితే శ్రియా,ఆండ్రీలు దాదాపు ఏడేళ్లపాటు ప్రేమించుకున్నాక 2018లో ఉదయ్‌పూర్ వేదికగా పెళ్లి చేసుకున్నారు. శ్రీయా చాలా సీక్రేట్ గా ఎవరికీ తెలియకుండా ఆడపిల్లకు జన్మనిచ్చింది. గతేడాది తనకు 9 నెలల కూతురు ఉన్నట్లు మీడియాకు వెల్లడించింది.