ప్రభాస్ కు రిటర్న్ గిఫ్ట్!

Published : Jan 14, 2019, 03:15 PM IST
ప్రభాస్ కు రిటర్న్ గిఫ్ట్!

సారాంశం

బాహుబలి అనంతరం సాహో సినిమాతో బిజీ బిజీగా గడుపుతున్న ప్రభాస్ మంచి భోజన ప్రియుడని స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ప్రభాస్ పక్కన ఉంటే ఎవ్వరైనా సరే సరికొత్త రుచులతో విందు లభిస్తుంది. 

బాహుబలి అనంతరం సాహో సినిమాతో బిజీ బిజీగా గడుపుతున్న ప్రభాస్ మంచి భోజన ప్రియుడని స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ప్రభాస్ పక్కన ఉంటే ఎవ్వరైనా సరే సరికొత్త రుచులతో విందు లభిస్తుంది. ఇక ప్రత్యేక అతిధులు ఎవరైనా వస్తే వారికి మరచిపోని భోజనం ఏర్పాటు చేయడంలో రాజు గారు ముందుంటారు. 

ఇక సాహో సినిమాతో గత కొంత కాలంగా దగ్గరగా ఉంటున్న హీరోయిన్ శ్రద్దా కపూర్ కి కూడా ప్రభాస్ ఆంధ్ర తెలంగాణ టెస్ట్ లను చాలానే చూపించాడట. రోజుకో వెరైటీ ఫుడ్ తో తెలుగు వారి వంటలను నార్త్ బ్యూటికి బాగా అలవాటు చేసినట్లు తెలుస్తోంది. మరి అంత చేసిన ప్రభాస్ కి అమ్మడు కూడా రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలిగా అందుకే నార్త్ టెస్ట్ లను ప్రభాస్ కి అలాగే సాహు టీమ్ కు పంపించింది. 

సంక్రాంతి ఫెస్టివల్ సందర్బంగా మహారాష్ట్ర లోని స్పెషల్ టిల్ గుల్ లడ్డులను అందరికి ప్యాక్ చేసి ఇచ్చిందట ఈ బాలీవుడ్ బ్యూటీ. అలాగే ఎంతో రుచికరమైన హోమ్ మెడ్ నెయ్యిని కూడా శ్రద్దా ప్రభాస్ కి పంపినట్లు తెలుస్తోంది. మొత్తానికి శ్రద్దా తన నార్త్ టెస్ట్ లను సాహు టీమ్ కు చూపించి ఒక మంచి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చిందనే చెప్పాలి. 

PREV
click me!

Recommended Stories

Actor Ravi Mohan: డైరెక్టర్ కాకముందే విలన్‌గా రవి మోహన్.. షాకింగ్ రెమ్యూనరేషన్
Sudha Kongara: పరాశక్తి డైరెక్టర్ సుధా కొంగర నెక్స్ట్ మూవీ.. స్టార్ హీరో కొడుకుతో భారీ ప్లాన్ ?