వైరల్ వీడియో: 'బాత్రూంలో నీళ్లే రావటం లేదు'... చిరు డైలాగు కేక

By Surya PrakashFirst Published Apr 7, 2020, 12:57 PM IST
Highlights

 ‘ఓయ్ ఓయ్.. ఏంటా కొట్టడం తలుపు ఇరిగిపోగలదు.. ఈ బాత్ రూంలోకి నీళ్లే రావడం లేదు, కళ్ల జోడు ఎక్కడ నుంచి వస్తుంది’  అంటూ చిరంజీవి చెప్పిన డైలాగుతో వచ్చిన షార్ట్ ఫిల్మ్ ఇప్పుడు దుమ్ము దులిపేస్తోంది. 


 ‘ఓయ్ ఓయ్.. ఏంటా కొట్టడం తలుపు ఇరిగిపోగలదు.. ఈ బాత్ రూంలోకి నీళ్లే రావడం లేదు, కళ్ల జోడు ఎక్కడ నుంచి వస్తుంది’  అంటూ చిరంజీవి చెప్పిన డైలాగుతో వచ్చిన షార్ట్ ఫిల్మ్ ఇప్పుడు దుమ్ము దులిపేస్తోంది. అలాగే ఆ షార్ట్ ఫిల్మ్ లో రజనీ అయితే.. కళ్ల జోడు చూశారా అంటే.. ‘ఇదా అంటూ తన స్టైలిష్ కూలింగ్ క్లాస్‌ను తనదైన స్టైల్ లో తిప్పుతూ చూపించడం రజినీ మార్క్ ని గుర్తు చేసింది’.ఇంతకీ ఆ షార్ట్ ఫిల్మ్ ఎవరు చేసారు..ఆ కథేంటి..మేమూ చూస్తాం అంటారా...

కరోనా వైరస్ పై ప్రజల్లో అవగాహన పెంచేలా ప్రముఖ నిర్మాత, దర్శకుడు కరణ్ జొహార్, రకరకాల భాషల్లోని సూపర్ స్టార్ లను భాగం చేస్తూ నిర్మించిన షార్ట్ ఫిల్మ్ 'ఫ్యామిలీ' . ఈ షార్ట్ ఫిల్మ్ సోనీ టీవీలో విడుదల కాగా, అప్పటి నుంచి లక్షల వ్యూస్ సాధిస్తూ, ట్రెండింగ్ లోకి వెళ్లిపోయింది. కరోనా మహమ్మారి వ్యాపిస్తున్న వేళ, ఇళ్లలోనే ఉండాలన్న సందేశాన్ని ఈ షార్ట్ ఫిల్మ్ ఇస్తూ సాగింది.

ఇందులో కథేంటి..

ఇంటి పెద్దగా ఉన్న అమితాబ్, తన సన్ గ్లాసెస్ ను ఎక్కడో పడేసుకుని, వాటిని వెతికే పనిలో ఉండటంతో మొదలయ్యే షార్ట్ ఫిల్మ్, దాన్ని కనుగొనేందుకు పలు భాషలకు చెందిన నటీ నటులు ప్రయత్నించడం, చివరకు సన్ గ్లాసెస్ దొరకడం, ఆపై అమితాబ్ ఇచ్చే చిన్న సందేశంతో ముగుస్తుంది.

chiranjeevi short film

చివర్లో  ఈ షార్ట్ ఫిల్మ్ ను షూట్ చేసేందుకు ఇందులో నటించిన నటీనటులు ఎవరూ తమతమ ఇళ్ల నుంచి కదల్లేదని, ప్రజలు కూడా ఇళ్లలోనే ఉండాలని అమితాబ్ సందేశాన్ని ఇచ్చారు. ఎవ్వరూ ఇళ్ల నుంచి బయటకు రావద్దని సూచించారు. ఈ షార్ట్ ఫిల్మ్ తో భారత సినీ పరిశ్రమ ఒకటేనని చాటినట్లయిందని అన్నారు.

ఇక షార్ట్ ఫిల్మ్ లో అమితాబ్ బచ్చన్, రజనీకాంత్, చిరంజీవి, మోహన్ లాల్, ప్రియాంకా చోప్రాలు కనిపిస్తారు. వీరితో పాటు ఈ షార్ట్ ఫిల్మ్ లో మమ్ముట్టి, రణబీర్ కపూర్, ఆలియా భట్, ప్రసేన్ జిత్ ఛటర్జీ, శివరాజ్ కుమార్, సోనాలీ కులకర్ణి, దల్జిత్ దోస్నాజ్ తదితరులు కూడా నటించడం విశేషం.
 

click me!