మహేష్ బాబు సినిమా షూటింంగ్ కు అనుమతి నిరాకరణ

First Published Aug 20, 2017, 7:57 PM IST
Highlights
  • శ్రీమమంతుడు తర్వాత మహేష్, కొరటాల కాంబినేషన్ లో మూవీ
  • భరత్ అను నేను టైటిల్ తో తెరకెక్కుతున్న చిత్రం
  • యూపీలోని మూసాబాగ్ లో షూటింగ్ కు అనుమతివ్వని ఆర్కియాలజీ శాఖ
  • మరో లొకేషన్ కోసం వెతుకుతన్న యూనిట్

 బ్లాక్  బస్టర్ మూవీ 'శ్రీమంతుడు' తర్వాత మహేష్ బాబు, కొరటాల శివ కాంబినేషన్లో  తెరకెక్కుతున్న భరత్ అను నేను ప్రస్థుతం షూటింగ్ పనుల్లో బిజీగా వుంది. ఈ సినిమాకు సంబంధించిన కొన్ని సన్నివేశాలు లక్నోలో చిత్రీకరించాలని ప్లాన్ చేయగా.. అక్కడ అనుమతి లభించకపోవడంతో మహేష్,కొరటాల అండ్ టీమ్ అఫ్ సెట్ అయింది.

 

లక్నోలోని చారిత్రక ప్రదేశం మూసాబాగ్ వద్ద సినిమా షూటింగ్ ప్లాన్ చేశారు. ఈ మేరకు అనుమతి కోసం స్థానిక అధికారులను సంప్రదించగా.... 'ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా' అధికారులు అనుమతి నిరాకరించారు. మూసాబాగ్‌లో అనుమతి లభించక పోవడంతో ఫైట్ సీన్ చిత్రీకరణ కోసం వేరే లొకేషన్ వెతుకుతున్నారు. అయితే ఈ ఆలస్యం సినిమా ఓవరాల్ షూటింగ్ షెడ్యూల్ మీద ప్రభావం చూపే అవకాశం ఉంది.

 

లక్నోలో దాదాపు నెల రోజుల పాటు షూటింగ్ జరగాల్సి ఉంది. అయితే అనుకోకుండా అనుమతి నిరాకరణ ఎదురవ్వడంతో షూటింగ్ ప్లాన్, షెడ్యూల్ అంతా అప్ సెట్ అయింది. అనుమతి నిరాకరణకు కారణాలు చాలా ఉన్నాయి. అక్కడ ఏ వస్తువులను తాకొద్దని, చివరకు గోడలను కూడా టచ్ చేయకుండా ఉండాలని కఠినమైన నిబంధనలు ఉన్నాయి. మూసా బాగ్ చారిత్రక ప్రదేశం కావడంతో ఇలాంటికఠినమైన నిబంధనలు ఉన్నాయి. అందుకే సినిమా షూటింగుకు అనుమతి ఇవ్వలేదు.


భరత్ అను నేను నిర్మాత డి.వి.వి.దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. మహేష్‌ సరసన హీరోయిన్‌ గా కైరా అద్వాని నటిస్తోంది. ప్రకాష్‌రాజ్‌ ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రాన్ని జనవరి 11న సంక్రాంతి కానుకగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. డి.వి.వి.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ఎల్‌ఎల్‌పి బేనర్‌పై నిర్మాణమవుతున్న ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్‌, సినిమాటోగ్రఫీ: రవి కె.చంద్రన్‌, నిర్మాత: డి.వి.వి.దానయ్య, దర్శకత్వం: కొరటాల శివ.

click me!