
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) మరియు స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం ‘ఆర్సీ15’(RC15). హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ (Kiara Advani) చెర్రీ సరసన ఆడిపాడనుంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ పొటిటికల్ డ్రామా శరవేగంగా షూటింగ్ పార్ట్ ను పూర్తి చేసుకుంటోంది. గతేడాది ప్రారంభమైన మూవీ చిత్రీకరణ ప్రస్తుతం తుది దశకు చేరుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే పంజాబ్ స్టేల్, ఏపీ, తెలంగాణలో పలు షెడ్యూళ్లను కంప్లీట్ చేసకున్న ‘ఆర్సీ15’ చిత్ర యూనిట్ ప్రస్తుతం హైదరాబాద్ లోనే కీలక సన్నివేశాలను షూట్ చేస్తోంది.
తాజా సమాచారం ప్రకారం.. ఆర్సీ15 న్యూ షెడ్యూల్ ప్రస్తుతం సికింద్రాబాద్‌లోని విక్టోరియా మెమోరియల్ హాల్‌లో కొనసాగుతోంది. రామ్ చరణ్ తో పాటు పలువురు కీలక తారాగణం ఈ షెడ్యూల్ లో పాల్గొన్నట్టు తెలుస్తోంది. అయితే తాజాగా దర్శకుడు శంకర్ (Shankar) చిత్రానికి సంబంధించిన కీలక సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నట్టు తెలుస్తోంది. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ చిత్రంలోని కీలకమైన ఎన్నికల ఓట్ల లెక్కింపు సన్నివేశాన్ని శంకర్ తెరకెక్కిస్తున్నారని తెలుస్తోంది.
మరోవైపు ఈ చిత్రంలో ఫైట్స్, సాంగ్స్ చిత్రీకరణను ఒక్కొక్కటీగా పూర్తి చేస్తున్నారు. రీసెంట్ గా 1200 మందితో ఓ యాక్షన్ సీక్వెన్స్ ను తెరకెక్కించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం షెడ్యూల్ తర్వాత కూడా మరో 400 మంది ఆర్టిస్ట్ లతో సాలిడ్ సాంగ్ షూట్ కూడా ఉంటనున్నట్టు తెలుస్తోంది. ఇక ఇప్పటికే ఈ మూవీకి ‘సర్కారోడు’ అనే టైటిల్ ఖరారైనట్టు సమాచారం. ఇంకా అఫిషియల్ అనౌన్స్ మెంట్ రావాల్సింది. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు తన సొంత బ్యానర్ శ్రీ వెంకటేశ్వర్ క్రియేషన్స్ పై మూవీని నిర్మిస్తున్నారు. అంజలి, శ్రీకాంత్, సునీల్, ప్రకాష్ రాజ్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు.