స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతోన్న ప్యాన్ ఇండియా చిత్రం ‘పుష్ప’. ఈ సినిమా విలన్ ఎంపిక విషయంలో చాలా రోజులుగా కొనసాగుతోన్న సస్పెన్స్‌కు రీసెంట్ గా మైత్రీ మూవీ మేకర్స్ తెరదించారు. మలయాళ స్టార్ హీరో..జాతీయ అవార్డ్ గ్రహీత ఫహద్ ఫాజిల్.. ‘పుష్ప’ చిత్రంలో విలన్‌గా నటించబోతున్నట్లు మైత్రీ మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించింది.
స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతోన్న ప్యాన్ ఇండియా చిత్రం ‘పుష్ప’. ఈ సినిమా విలన్ ఎంపిక విషయంలో చాలా రోజులుగా కొనసాగుతోన్న సస్పెన్స్‌కు రీసెంట్ గా మైత్రీ మూవీ మేకర్స్ తెరదించారు. మలయాళ స్టార్ హీరో..జాతీయ అవార్డ్ గ్రహీత ఫహద్ ఫాజిల్.. ‘పుష్ప’ చిత్రంలో విలన్‌గా నటించబోతున్నట్లు మైత్రీ మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించింది. మొదట్లో ‘పుష్ప’లో విలన్‌గా కోలీవుడ్ నటుడు, విజయ్ సేతుపతి పేరు ప్రముఖంగా వినిపించింది. అయితే చిత్ర నిర్మాణ సంస్థ ఎవరూ ఊహించని విధంగా ఫహద్ ఫాజిల్ పేరుని ఖరారు చేసి ప్రకటించింది. ఫహద్ నటిస్తోన్న తొలి తెలుగు మూవీ ఇది. ఈ నేపధ్యంలో బన్నికి విలన్ గా చేసే ఈ ఆర్టిస్ట్ కు ఎంత ఇవ్వబోతున్నారు, పాత్ర ఏమిటి అనే టాక్ అంతటా మొదలైంది.
ఫహద్ ఫాజిల్..మళయాళంలో మంచి క్రేజ్ ఉన్న ఆర్టిస్ట్ కావటం,బన్నికి అక్కడ మార్కెట్ ఉండటంతో కేరళలోనూ ఈ సినిమాకు మంచి బిజినెస్ అవుతుందని అంచనా వేస్తున్నారు. ఈ సినిమాలో ఫహద్ ఫాజిల్ రోల్ పై ఒక ఇంట్రస్టింగ్ అప్ డేట్ ఫిల్మ్ నగర్ వర్గాల్లో వినపడుతోంది. ఈ సినిమా ఫహద్ ఫారెస్ట్ ఆఫీసర్ రోల్ అని, ఆటవిక జాతులను హసించి పైశాచిక ఆనందాన్ని పొందుతాడని తెలుస్తోంది. చాలా కొత్తగా ఈ పాత్ర ఉండబోతోందిట. అలాగే ఈ పాత్ర నిమిత్తం డేట్స్ ఎక్కువే ఎలాట్ చేయాల్సి ఉంటుందిట .ఈ నేపధ్యంలో ఫాహద్ ఫాజిల్ కి 5 కోట్ల పారితోషకం ఆఫర్ చేశి,ఎగ్రిమెంట్ చేసారనే వార్త బయటికి వచ్చింది. నేషనల్ అవార్డు గ్రహీత ఫాజిల్ కి ఐదు కోట్లు ఇవ్వడం పెద్ద విషయం కాదని ఆయన అభిమానులు అంటున్నారు.
ఇక శేషాచల అడవుల్లో మాత్రమే కనిపించే ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సినిమా తెరకెక్కుతోంది. ఇప్పటి వరకు చైనా, జపాన్ వంటి పలు దేశాలకు లక్షన్నర కోట్ల రూపాయల విలువైన ఎర్ర చందనంను స్మగ్లింగ్ చేశారని చెప్తారు. ఈ విషయాలని రీసెర్చి చేసి మరీ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తన్నారట. ఇక మొదట దీన్ని వెబ్ సిరీస్‌గా చేద్దామని కథను సిద్ధం చేసుకున్నాడట. అయితే ఇప్పుడు ఆ కథతోనే సినిమా చేస్తున్నానని సుకుమార్ రీసెంట్‌గా పాల్గొన్న ఓ ప్రైవేట్ కార్యక్రమంలో తెలియజేశాడు.
రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్, ముత్తం శెట్టి మీడియా ఈ సినిమాను నిర్మిస్తోంది. ఆర్య, ఆర్య2 చిత్రాల తర్వాత బన్నీ, సుకుమార్ కాంబినేషన్ లోవస్తోన్న ఈ సినిమాపై ప్రేక్షకాభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. ఆగస్ట్ 13న ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలవుతుంది. ఇప్పటికే మారేడుమిల్లి, రంపచోడవరంలలో రెండు షెడ్యూల్స్ షూటింగ్ పూర్తయ్యింది.