'బిగ్ బాస్ 3' కంటెస్టంట్.. చంపేస్తామంటూ బెదిరింపులు!

Published : Jul 01, 2019, 12:41 PM IST
'బిగ్ బాస్ 3' కంటెస్టంట్.. చంపేస్తామంటూ బెదిరింపులు!

సారాంశం

బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ ఎంతగా పాపులర్ అయిందో తెలిసిందే. ప్రస్తుతం తమిళంలో మూడో సీజన్ మొదలైంది. 

బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ ఎంతగా పాపులర్ అయిందో తెలిసిందే. ప్రస్తుతం తమిళంలో మూడో సీజన్ మొదలైంది. ఇందులో కంటెస్టంట్ గా పాల్గొన్న మిస్ సౌత్ ఇండియా విజేత మీరా మిథున్ కి హత్యా బెదిరింపులు వస్తున్నట్లు ఆమె తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

2016లో జరిగిన మిస్ సౌత్ ఇండియా పోటీలలో మీరా మిథున్ పాల్గొని విజేతగా నిలిచింది. ఆ తరువాత కోలీవుడ్ కి నటిగా పరిచయమైంది. ఇటీవల ఆమెకి ఇచ్చిన మిస్ సౌత్ ఇండియా బిరుదుని ఆ సంస్థ వెనక్కి తీసుకుంది. ప్రస్తుతం మీరా మిథున్ బిగ్ బాస్ 3 సీజన్ షో హౌస్ లో ఉంది.

ఈ క్రమంలో ఆమె తల్లి కేరళకు చెందిన ఓ వ్యక్తి తమ కుమార్తె బిగ్ బాస్ షో నుండి బయటకి రావాలని.. సోషల్ మీడియాలో ఆమె గురించి అసత్య ప్రచారాలు చేయడంతో పాటు హత్యా బెదిరింపులకు కూడా పాల్పడుతున్నాడని.. అతడిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని మీరా మిథున్ తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. 
 

PREV
click me!

Recommended Stories

కాసుల వర్షం కురిపిస్తున్న రాజా సాబ్, ప్రభాస్ సినిమా 3 రోజుల కలెక్షన్స్ ఎంతంటే?
కెమెరాల ముందు ప్రియాంక, నిక్ రొమాన్స్, గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్‌లో స్టార్ కపుల్ సందడి